E-Paper
Advertisement

వివాదంగా మారిన టీమిండియా జెర్సీ..కాషాయ రంగుపై విమ‌ర్శ‌లు !

వివాదంగా మారిన టీమిండియా జెర్సీ..కాషాయ రంగుపై విమ‌ర్శ‌లు !
Advertisement

Team India Jersy Asian Games:  టీమిండియా జెర్సీపై ( Team India Jersy ) మరోసారి వివాదం రాజుకుంది. ప్రస్తుతం స్కై బ్లూ కలర్ జెర్సీతో బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ కోసం సరికొత్త జెర్సీతో మైదానంలో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియా బ్లూ జెర్సీని కాస్త… కాషాయ రంగులోకి మార్చేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన కాంగ్రెస్ పార్టీ ప్రతి నిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కాషాయ జెండా ( BJP’s saffron flag ) తరహాలోనే జెర్సీ ఉందని… ఈ జెర్సీని తీసుకువస్తే.. ప్రత్యేక ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. కాషాయ రంగు జెర్సీ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

వివాదంగా మారిన టీమిండియా జెర్సీ..కాషాయ రంగుపై విమ‌ర్శ‌లు !

రాబోయే ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంటు (2026 Asian Games tournament) నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాంప్రదాయ బ్లూ కలర్ జెర్సీకి గుడ్ బై చెప్పి, కాషాయ రంగులో… టీమిండియాను బరిలోకి దించే ఆలోచన చేస్తున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ కాషాయ రంగు జెర్సీపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. చర్చ మొదలైంది. అచ్చం బీజేపీ జెండా రంగులోనే ఈ టీమిండియా జెర్సీ ఉంటుందన్న వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉందని కాషాయ రంగు జెర్సీని టీమిండియా ప్లేయర్లకు వేస్తారా? ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచనలు అంటూ ఫైర్ అవుతున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అటు బీసీసీఐ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో హాకీ ఇండియా కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. బ్లూ కలర్ సింథటిక్ టర్ప్ ల‌పై ఆటగాళ్లు స్పష్టంగా కనిపించేందుకు వీలుగా ఇండియన్ హాకీ జట్టుకు కాషాయ రంగు ప్రాథమిక జెర్శిగా ఖరారు చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు టీమిండియా కూడా అదే తరహాలో జెర్సీని ధరించే ఛాన్సులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా వ్యతిరేకత మొదలైంది. కాగా ఏషియన్ గేమ్స్ క్రికెట్ ఈవెంట్ కోసం శ్రేయ‌స్ అయ్యర్ కెప్టెన్సీ లోని 15 మంది సభ్యుల టీమిండియా బరిలోకి దిగనుంది. ఇది ఇలా ఉండ‌గా, ఏషియ‌న్ గేమ్స్ 2026 టోర్న‌మెంట్ సెప్టెంబ‌ర్ 19 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Related News

టీమిండియా తిక్క కుదరాలంటే, నఖ్వీకి ఐసీసీ చైర్మన్ పదవి ఇవ్వండి..!

పాకిస్తాన్ కోచ్ లుగా షోయ‌బ్ అక్త‌ర్‌, అఫ్రిదిల‌ను పెట్టుకోండి..!

ఈ టార్చ‌ర్ నా వ‌ల్ల కాదు..ఐపీఎల్ 2027 మ‌ధ్య‌లోనే త‌ప్పుకుంటా !

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల నోట్లో మ‌ట్టి కొట్టిన BBL…టైం చూసి దెబ్బేశారు

రాసి పెట్టుకోండి.. ఎప్పుడు, ఎక్క‌డ మ్యాచ్ జ‌రిగినా మాదే విజ‌యం

క‌ళ్లు మూసుకుని బ్యాటింగ్ చేస్తావా ? అంటూ అభిషేక్ కు యూవీ పనిష్ మెంట్

క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్‌.. టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు భారీ అడ్డంకి !

Big Stories

Advertisement
×