BigTV English

Chess Olympiad 2024: నిరీక్షణకు తెర.. చెస్ ఛాంపియన్ షిప్ లో అదరగొట్టిన ఇండియా..

Chess Olympiad 2024: నిరీక్షణకు తెర.. చెస్ ఛాంపియన్ షిప్ లో అదరగొట్టిన ఇండియా..

Chess Olympiad 2024: చెస్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఇండియా అదరగొట్టింది. ఒలింపియాడ్‌లో రెండు స్వర్ణాలతో హిస్టరీ క్రియేట్‌ చేశారు. పురుషులు, మహిళల జట్లు సూపర్ విక్టరీని సొంతం చేసుకున్నాయి. 200కిపైగా దేశాలకు సంబంధించిన హేమాహేమీలను వెనక్కు నెట్టి.. ఇండియన్‌ టీమ్‌లు ఫైనల్స్ కు దూసుకెళ్లాయి. అన్ని దేశాల క్రీడాకారుల ఎత్తులకు.. పై ఎత్తులు వేస్తూ.. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌ల్లో బంగారాల్లా నిలిచారు భారత చెస్‌ ఆటగాళ్లు. పురుషులు, మహిళల విభాగాల్లో పసిడి పతకాలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.


బంగారు పతకాలు సాధించాలనే లక్ష్యంతో భారత చెస్‌ ప్లేయార్లు మొదటి నుంచి అద్భుతంగా రాణించారు. చివరి రౌండ్‌లో మాంచి ఊపును ప్రదర్శించి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నారు. నిన్న జరిగిన లాస్ట్‌ రౌండ్‌లో భారత పురుషుల జట్టు 3.5-0.5 తో స్లొవేనియాను ఓడించారు. టాప్‌ సీడ్‌ మహిళల జట్టు కూడా గ్రేట్‌గా ఆడారు. 3.5-.5తో అజర్‌బైజానపై గెలుపొందారు.

10వ రౌండ్ పూర్తయ్యేసరికి పురుషులు బంగారు పతకాన్ని ఖాయం చేసుకున్నారు. ఆ తర్వాత మహిళల స్వర్ణపతకం ఇండియాకు వస్తుందో లేదోనన్న టెన్షన్ ఏర్పడింది. కజకిస్థాన్, అమెరికా చెస్ ప్లేయర్లు ఫైనల్స్ లో ఉండటమే ఇందుకు కారణం. చివరి రౌండ్ లో భారత మహిళలు గెలవగా.. ఫైనల్ రౌండ్ లో కజకిస్థాన్ – అమెరికా డ్రా అవ్వడంతో స్వర్ణం మనకే దక్కింది.


Also Read:  టీమిండియా అదిరిపోయే విక్టర్‌..280 పరుగుల తేడాతో విక్టరీ !

పురుషుల జట్టు 11 రౌండ్లలో 22 పాయింట్లకు గాను 21 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలువగా.. టైబ్రేకర్ స్కోర్ 17 పాయింట్లతో అమెరికా రెండోస్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్ కూడా 17 పాయింట్లతో కాంస్యపతకాన్ని సొంతం చేసుకున్నారు.

చెస్ ఒలింపియాడ్ లో భారత్ కు 2 స్వర్ణాలు రావడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేస్తూ X వేదికగా ట్వీట్ చేశారు. 45వ FIDE చెస్ ఒలింపియాడ్ ను గెలవడం.. భారతదేశానికి చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. చెస్ ఒలింపియాడ్ లో ఓపెన్ మహిళల విభాగంలో భారత్ స్వర్ణ పతకాన్ని సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. పురుషులు, మహిళల చెస్ జట్లకు అభినందనలు తెలిపారు. ఈ విజయం క్రీడాపథంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని, మున్ముందు చెస్ లో రాణించాలనుకునేవారికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×