BigTV English

Devara Pre Release Event : విధ్వంసం వెనుకకుట్ర కోణం… రంగంలోకి దిగిన పోలీసులు..

Devara Pre Release Event : విధ్వంసం వెనుకకుట్ర కోణం… రంగంలోకి దిగిన పోలీసులు..

Devara Pre Release Event : ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎన్టీఆర్ దేవర మ్యానియా కొనసాగుతుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు నందమూరి అభిమానులతో పాటుగా యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా విడుదలకు కొద్దిరోజులు ఉండటంతో కొరటాలా టీమ్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. తారక్ మాస్ అవతారాన్ని, ఊచకోతను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆత్రుతగా వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ 27న యంగ్ టైగర్ ఆయుధపూజకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయం అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తూ చెబుతున్నారు. ఇక సెప్టెంబర్ 22న జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అభిమానులు నిరాశకు గురైయ్యారు.. ఈ ఈవెంట్ రద్దు అని తెలిసి నోవాటెల్ హోటల్ దగ్గర రచ్చ జరిగిన విషయం అందరికీ తెలుసు.. తాజాగా ఈ విధ్వంసం వెనుక కుట్ర జరిగిందా అని పోలీసులు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమ అభిమాన హీరో వస్తున్నారని తెలుసుకొని ఫ్యాన్స్ సంబరపడి పోయారు. ఇక నోవాటెల్ లాంటి క్లోజ్ డ్ ఆడిటోరియంలో ఈవెంట్ జరుగుతుందని తెలిసినా దానికి తగ్గట్లుగానే పాస్ లు ఇచ్చినా, దాదాపు 30 వేల మంది ఫ్యాన్స్ రావడం ఏంటి? ఇంటిలిజెన్స్ వర్గాలు సకాలంలో స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదమే తప్పింది. తారక్ కోసం అభిమానులు ఇలా పోటెత్తడం చూసి దేశం మొత్తం ఫ్యాన్స్ అశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. ఇది ఎలా సాధ్యం హీరో కోసం ఇంత రచ్చ జరిగిందంటే జనం నమ్మలేక పోతున్నారు. మొత్తం ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు. తాజాగా ఈ గొడవకు గల కారణాలు ఏంటా అని తెలుసుకొనేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

Was there a conspiracy behind the destruction of the hotel after the cancellation of the Devara prerelease event?


దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. నోవాటెల్ ధ్వంసం వెనుక కుట్ర..

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తెలుగు రాష్ట్రాల అభిమానులు భారీ ఎత్తున ఈవెంట్ కు తరలి వచ్చారు. ఈవెంట్ నిర్వాహకులు ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభిమానులు ఇరు రాష్ట్రాల నుంచి తరలిరావడంతో.. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నోవాటెల్ లోకి ఫ్యాన్స్ దూసుకెళ్లడం తో అద్దాలు ధ్వంసం అయ్యాయి, దాంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. అయినప్పటికీ.. తమ అభిమాన హీరోన చూసేందుకు ఫ్యాన్స్ ఏ మాత్రం వెనకడు వేయలేదు.. ఈ ఈవెంట్ రద్దు అవ్వడంతో ఫ్యాన్స్ హోటల్ పై దాడి చేశారు. అద్దాలను పగల గొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ విధ్వంసం వెనుక ఏదైన కుట్ర జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.. హోటల్ లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు.. ఇతర హీరోల ఫ్యాన్స్ ఏమైనా వచ్చి అల్లర్లు సృష్టించారా అని కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×