BigTV English

WTC Final: బంగ్లాపై గెలిచిన టీమిండియాకు కొత్త టెన్షన్‌.. WTC ఫైనల్ చేరాలంటే ఇది చేయాల్సిందే?

WTC Final: బంగ్లాపై గెలిచిన టీమిండియాకు కొత్త టెన్షన్‌.. WTC ఫైనల్ చేరాలంటే ఇది చేయాల్సిందే?

 


Road To WTC Final How Are India Placed After 280-Run Win In Chennai Test: టి20 ప్రపంచ కప్ తర్వాత మళ్లీ.. గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన టీమిండియా… మంచి శుభారంబాన్ని అందుకుంది. టీమిండియా వర్సెస్.. బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్లో… రోహిత్ సేన అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. ఏకంగా 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసింది టీమిండియా. మొదటి ఇన్నింగ్స్ అలాగే రెండవ ఇన్నింగ్స్ లో టీమిండియా అసాధారణ ప్రదర్శన కనబరచడంతో అవలీలగా గెలవగలిగింది.

ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా జట్టు… ఫస్ట్ ఇన్నింగ్స్ లో 376 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ విఫలమైనా… రవిచంద్రన్ అశ్విన్ అలాగే రవీంద్ర జడేజా రాణించగలిగారు. దీంతో 376 పరుగులు చేయగలిగింది టీం ఇండియా జట్టు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో కూడా పంత్, గిల్ అద్భుతంగా రాణించడంతో.. నాలుగు వికెట్లు నష్టపోయి 287 పరుగులు చేసింది టీమిండియా.


అయితే రెండు ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడిన టీమ్ ఇండియా… బంగ్లాదేశ్ బాటర్ లను కూడా చాలా కట్టడి చేయగలిగింది. ఈ తరుణంలోనే మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ జట్టును 149 పరుగులకు, సెకండ్ ఇన్నింగ్స్ లో 234 పరుగులకు ఆల్ అవుట్ చేయగలిగింది టీమ్ ఇండియా. దీంతో 280 పరుగులు తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన రవిచంద్రన్ అశ్విన్ కు మాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది.

Road To WTC Final How Are India Placed After 280-Run Win In Chennai Test
Road To WTC Final How Are India Placed After 280-Run Win In Chennai Test

అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని అనుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే… టీమిండియా కు కొత్త టెన్షన్ మొదలైంది. అదేంటంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం బెర్త్ సాధించడం. ఆ స్థానం సంపాదించాలంటే టీమిండియా ముందు పెను సవాళ్లు ఉన్నాయి. వాటిని ఒకసారి పరిశీలిస్తే… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు టీమిండియా చేరాలంటే కచ్చితంగా ఆరు మ్యాచ్లు గెలవాలి.

Also Read: IND vs BAN: రిషబ్ పంత్‌ క్షుద్ర పూజలు…ఇదిగో ఫోటోలు..?

ఈ ఫైనల్ కంటే ముందు 9 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది టీం ఇండియా. ఈ తొమ్మిది మ్యాచ్లలో కచ్చితంగా ఆరు గెలవాలి. ఇందులో ఒకటి బంగ్లాదేశ్ తో టెస్ట్ మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే. అనంతరం న్యూజిలాండ్తో మూడు టెస్టులు ఉంటాయి. ఈ నాలుగు టెస్ట్ మ్యాచ్లు మొత్తం ఇండియాలోనే జరగనున్నాయి. అయితే ఆ తర్వాత విదేశీ గడ్డపై అంటే ఆస్ట్రేలియాలో ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది టీమిండియా. ఈ ఐదు టెస్ట్ మ్యాచ్ లే టీం ఇండియాకు చాలా కీలకము. అయితే ఆస్ట్రేలియా జట్టు పైన ఐదు మ్యాచ్లు గెలిచిన… లేదా ఒక మ్యాచ్ డ్రా చేసుకున్నా కూడా టీమిండియా కు.. ఛాన్స్ ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టును ఓడించడం టీమిండియా కు పెద్ద సవాలే. కాబట్టి బంగ్లాదేశ్ అలాగే, న్యూజిలాండ్ పై వరుసగా గెలవాలి. ఆ లెక్కన ఆస్ట్రేలియా పై రెండు గెలిచిన సరిపోతుంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×