E-Paper
Advertisement

WTC Points: WTCలో ఆరో స్థానానికి పడిపోయిన ఇండియా, ఇంకా మ‌నోళ్ల‌కు ఛాన్స్ ఉందా..!

WTC Points: WTCలో ఆరో స్థానానికి పడిపోయిన ఇండియా, ఇంకా మ‌నోళ్ల‌కు ఛాన్స్ ఉందా..!
Advertisement

WTC Points:  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక అప్డేట్ కావడంతో టీమిండియా ఒక స్థానాన్ని కోల్పోయి మరింత కిందికి వెళ్ళింది. తాజాగా వెస్టిండీస్ జట్టుపై న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో రెండవ టెస్టులో గ్రాండ్ విక్టరీ కొట్టింది. వెల్డింగ్టన్ వేదికగా విజయం సాధించడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్ళింది న్యూజిలాండ్. ప్రస్తుతం ఈ పాయింట్ల పట్టికలో టీమిండియా ఆరవ స్థానంలో ఉండగా న్యూజిలాండ్ మూడో స్థానానికి ఎగబాకింది.

WTC పాయింట్ల పట్టికలో దిగజారిన టీమిండియా

వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం మూడు టెస్టులు జరగాల్సి ఉంది. ఇప్పటికే మొదటి టెస్ట్ డ్రా కాగా రెండవ టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. వెస్టిండీస్ పై ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది న్యూజిలాండ్. ఈ తరుణంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మూడో స్థానానికి ఎగబాకింది. అటు టీమిండియా, ఆరో స్థానానికి పడిపోవడం గమనార్హం. టీమిండియా ఇలాగే కొనసాగితే, ఈ సారి కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకోవడం కష్టమే అంటున్నారు. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో 9 మ్యాచ్ లు ఆడిన టీమిండియా నాలుగు మ్యాచ్ ల‌లో, నాలుగు మ్యాచ్ ల‌లో ఓడిపోయింది. ఒకే ఒక్క మ్యాచ్ డ్రాగా ముగిసింది. అటు పాకిస్తాన్ 5వ స్థానంలో ఉండగా శ్రీలంక నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా దూకుడుగా ముందుకు వెళ్తోంది. WTC సిరీస్ లో భాగంగా మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడిన ఆస్ట్రేలియా ఐదింటిలో విజయం సాధించింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా రెండో స్థానంలో నిలిచింది. నాలుగు మ్యాచ్ లు ఆడిన దక్షిణాఫ్రికా మూడింటిలో గెలిచి ఒకే ఒక్క మ్యాచ్ లో ఓడిపోయింది. ఈ ఊపు ఇలాగనే కొనసాగితే మరోసారి ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఉండే ఛాన్సులు ఉంటాయి.

WTC ఫైనల్ కు టీమిండియా చేరాలంటే ఎలా?

Advertisement

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో టీమిండియా అర్హత సాధించాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈ పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో కొనసాగుతున్న టీమిండియా, కనీసం మరో ఎనిమిది మ్యాచ్ లు విజయం సాధించాలి. WTC సైకిల్ లో మరో 10 మ్యాచ్ లు టీమిండియా ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 8 మ్యాచ్ లు గెలవడం టీమిండియా కు అవసరం. ఆస్ట్రేలియా, శ్రీలంక అలాగే న్యూజిలాండ్ లాంటి బలమైన జట్లపై తన తర్వాతి పది మ్యాచ్ లు టీమ్ ఇండియా ఆడాల్సి ఉంది. శ్రీలంక పై రెండు టెస్టులు, న్యూజిలాండ్ పై రెండు, ఆస్ట్రేలియాపై ఐదు టెస్టులు ఆడాలి. ఇందులో కనీసం 8 మ్యాచ్ లు టీమిండియా గెలవడం అసాధ్యమని అంటున్నారు విశ్లేషకులు. అంటే ఈ లెక్క ప్రకారం ఈ సారి కూడా WTC ఫైనల్ కు టీమిండియా దూరం కానుంద‌ని అంటున్నారు.

 

Advertisement

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×