E-Paper
Advertisement

Basit Ali: ఓ దేవుడా ఇవాళ వ‌ర్షం ప‌డేలా చూడు..ఇండియా చేతిలో ఓడిపోకుండా కాపాడు సామీ

Basit Ali: ఓ దేవుడా ఇవాళ వ‌ర్షం ప‌డేలా చూడు..ఇండియా చేతిలో ఓడిపోకుండా కాపాడు సామీ
Advertisement

Basit Ali:  టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఈ రెండు జట్లు ఇవాళ సాయంత్రం తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వర్షం విలన్ గా మారే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ( Basit Ali ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో వర్షం పడాలని అల్లాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇవాల్టి కొలంబో మ్యాచ్ లో వర్షం పడితే ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోకుండా ఉంటుందని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే పాకిస్తాన్ కు ఒక పాయింట్ లభిస్తుందని కూడా గుర్తు చేశారు. ఆ భగవంతుడు ఆశీర్వదించి ఇవాల్టి మ్యాచ్ జరగకుండా వర్షం పడేలా చూడాలని కోరారు. దీంతో బాసిత్ అలీ ( Basit Ali ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: AUS vs ZIM-IND WC Wins: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓట‌మి..టీమిండియానే ఈ సారి ఛాంపియ‌న్‌…ఊరిస్తోన్న 1983, 2007 సెంటిమెంట్‌

ఓ దేవుడా ఇవాళ వ‌ర్షం ప‌డేలా చూడు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య మ్యాచ్ జరగనుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుండగా 90% వర్షపాతం పడే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ( Basit Ali ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారాలని కోరారు బాసిత్ అలీ. వర్షం ( India vs Pakistan Match Rain)  పడి మ్యాచ్ రద్దు కావాలని కోరారు.

ఆ అల్లా దయ వల్ల మ్యాచ్ రద్దు అయితే బాగుంటుందని తెలిపారు. మ్యాచ్ రద్దు అయితే పాకిస్తాన్ కు ఒక పాయింట్ వస్తుంది.. అదే మ్యాచ్ జరిగితే ఇండియా చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడటం గ్యారంటీ అన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే బెనిఫిట్ అంటూ బాసిత్ అలీ వ్యాఖ్యానించారు. దీంతో బాసిత్ అలీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై ఇండియన్ ఫాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఓడిపోతామని ఇంతకు కూడా తెగిస్తారా ? అంటూ కౌంటర్ ఇస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. కాగా ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ర‌ద్దు అయితే, ఐసీసీ రూల్స్ ప్ర‌కారం చెరో పాయింట్ ల‌భించ‌నుంది.

Advertisement

Also Read: Inzamam ul haq: రేపటి మ్యాచ్ లో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే, BCCIని రోడ్డుకు ఈడ్చుతా… ఇంజమామ్ హాట్ కామెంట్స్

 

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×