BigTV English

Indian Cricketers: టీమిండియా క్రికెటర్ల రెస్టారెంట్లు ఇవే..కోహ్లీనే ఇందులో తోపు !

Indian Cricketers: టీమిండియా క్రికెటర్ల రెస్టారెంట్లు ఇవే..కోహ్లీనే ఇందులో తోపు !

టీమిండియా స్టార్ క్రికెటర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచంలో ఏ క్రికెటర్ సంపాదించని అంతా టీమిండియా జట్టుకు ఆడిన ఆటగాడు సంపాదిస్తాడు. ఎందుకంటే ప్రపంచంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి అత్యంత ధనికమైన క్రికెట్ బోర్డు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి ముందు తలవంచాల్సిందే. దీనికి ప్రత్యేక ఉదాహరణ ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్. వాస్తవానికి చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటును.. పాకిస్తాన్ దేశంలోనే నిర్వహించాలి.


కానీ టీమిండియా, భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒత్తిడి మేరకు.. హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించాల్సి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి చెప్పినట్లే ఐసీసీ కూడా వినడం జరుగుతుంది. దీనికి కారణం మన క్రికెట్ బోర్డు చాలా బలమైనది. డబ్బు పరంగా అలాగే పేరు ప్రఖ్యాతలు ఉన్న బోర్డుగా… భారత క్రికెట్ నియంత్రణ మండలికి పేరు ఉంది. అయితే అలాంటి భారత క్రికెట్ నియంత్రణ మండలి బోర్డు కింద ఆడిన టీమిండియా ప్లేయర్లు అందరూ… భారీగానే సంపాదిస్తూ.. ఉంటారు. ఇతర క్రికెటర్ల కంటే టీమిండియా క్రికెటర్లకు జీతాలు ఎక్కువ. కోట్లల్లో వీళ్ళకు డబ్బులు వస్తాయి. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కారణంగా కూడా టీమిండియా ప్లేయర్లకు ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుంది.

రిషబ్ పంత్ లాంటి వారు 27 కోట్లు… ప్రస్తుతం పలకడం జరిగింది. అలా టీమ్ ఇండియా ప్లేయర్లు విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇచ్చే జీతాలతో పాటు బయట… రకరకాల ప్రకటనలతో ద్వారా కూడా కోట్లు సంపాదిస్తున్నారు. విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ కోట్లలో ఉంటుంది. అతడు ఏ ప్రకటన చేసినా కచ్చితంగా కోట్లల్లో డబ్బులు వసూలు చేస్తాడు. అయితే.. టీమిండియా క్రికెటర్లకు.. క్రికెట్ అలాగే ప్రకటనల ద్వారా వచ్చే డబ్బు కాకుండా… కొన్ని వ్యాపారాల ద్వారా కూడా అర్జిస్తున్నారు. చాలామంది టీమ్ ఇండియా క్రికెటర్లకు రకరకాల హోటల్ బిజినెస్ లు… ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రెస్టారెంట్లు ఉన్న టీమిండియా ప్లేయర్లు చాలామంది ఉన్నారు.


రెస్టారెంట్లు ఉన్న టీమిండియా ప్లేయర్లలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటికే హైదరాబాదు లాంటి ప్రముఖ నగరాలలో తన హోటలను స్థాపించాడు కోహ్లీ.విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో one 8 commune అనే హోటల్ నడుస్తోంది. దీనికి సంబంధించిన బ్రాంచీలు చాలానే ఉన్నాయి. దీని ద్వారా కోట్లల్లో విరాట్ కోహ్లీ సంపాదిస్తున్నాడు. ఈ విరాట్ కోహ్లీ హోటల్లో… స్టార్టింగ్ ఫుడ్ ధర దాదాపు 500 వరకు ఉంటుందట. ఇక టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జడ్డుస్ ఫుడ్ ఫీల్డ్ అనే రెస్టారెంట్ ను నడిపిస్తున్నాడు. ఈ రవీంద్ర జడేజా కు సంబంధించిన హోటల్స్ అన్ని… ఉత్తర భారత దేశంలోనే ఉన్నాయి. ఆ తర్వాత సురేష్ రైనా కూడా రైనా పేరుతో.. రెస్టారెంట్లు నడిపిస్తున్నాడు. ఇక జహీర్ ఖాన్ కూడా… రెస్టారెంట్ బిజినెస్ లు నడిపిస్తున్నాడు. డైన్ ఫైన్ అనే రెస్టారెంట్ బ్రాంచ్ లు కూడా కొనసాగిస్తున్నాడు జహీర్ ఖాన్. శిఖర్ ధావన్ నిర్వహిస్తున్న రెస్టారెంట్ పేరు ది ఫ్లయింగ్ క్యాచ్. దీనికి సంబంధించిన బ్రాంచ్ లు విపరీతంగానే ఉన్నాయి. ఇక మహిళా క్రికెటర్ స్మృతి మందాన మహారాష్ట్రలో రెస్టారెంట్స్ నడిపిస్తోంది. SM18 పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేసింది.

Related News

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

Big Stories

×