Kannappa: టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఈ మధ్య సరైన హిట్ సినిమాలు లేవు.. దాంతో ఇప్పుడు కథల విషయంలో జాగ్రత్తలు తీసుకొని మరి సరికొత్త కథతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాడు. మంచి విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కన్నప్ప’.. మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించడంతో పాటుగా సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మోహన్ బాబు ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్లకు పైగానే బడ్జెట్ను పెట్టినట్లు తెలుస్తుంది.. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం మంచు ఫాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఎంతైతే వచ్చిందో అలాగే నెగిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది.. తాజాగా ఈ సినిమా ఓటీటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది..
‘కన్నప్ప’ మూవీ స్టోరీ..
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘ కన్నప్ప’.. కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడానికి ఇండియన్సినిమా టాప్ స్టార్స్ ని ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించేలా విష్ణు ఓప్పించారు.. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాత్ర మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని సమాచారం.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.. కానీ విష్ణు మాత్రం ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడు. ఇప్పటికే పబ్లిసిటీ కోసం విష్ణు పలు ఇంటర్వ్యూ లకు హాజరవుతు సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.. ఈ మూవీ ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకున్న విషయాన్ని బయట పెట్టాడు.
Also Read :శ్రీలీల గొప్ప మనసు..ఎవరికి తెలియకుండా ఆ పని..!
ఓటీటీ డీల్ క్యాన్సిల్ అవ్వడం పై విష్ణు క్లారిటీ..
విష్ణు గత చిత్రాలను చూసి బయ్యర్స్ అడిగినంత డబ్బులు పెట్టి ఈ సినిమాని కొనే స్థితిలో లేరని తెలుస్తుంది..ఈ సినిమాను కొనేందుకు వున్న ఏకైక హోప్ ప్రభాస్.. కానీ ఇక్కడ ప్రభాస్ వున్నా కూడా ఈ చిత్రానికి ఆశించిన రేంజ్ లో బజ్ లేదన్నది వాస్తవం. ఇక ఇటీవల విష్ణు ప్రముఖ ఓటీటీ సంస్థలతో డీల్ కుదుర్చుకోవాలని చూసినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప బిగ్గెస్ట్ హిట్ అవుతుందని గట్టిగానే చెప్పాడు. తన సినిమాకు ఓటీటీ డీల్ గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశాడు. ఆయన అడిగినంత డబ్బులు ఇవ్వడానికి ఈ సంస్థలు ముందుకు రావడం లేదని సమాచారం.. ఒకవేళ ఆయన అడిగిన ప్రైజ్ కి సినిమాని కచ్చితంగా కొనుక్కోవాలంటే, సినిమాకి సంబంధించిన ప్రివ్యూ ని చూపించమని అడుగుతున్నారట.. అయితే మంచు విష్ణు ఆ ప్రతిపాదనకు నిరాకరించానని క్లారిటీ ఇచ్చాడు. భారీ బడ్జెట్ పెట్టాలంటే కచ్చితంగా ప్రింట్ ని ఒకసారి చూసి ఆ తర్వాత డీల్ ఫిక్స్ చేసుకోవడం ఓటిటి సంస్థలు చేస్తూనే ఉన్నారు పెద్ద పెద్ద సినిమాలు సైతం ఇలా చూసి ఓటిటిలో భారీ వరకు అమ్ముడుపోతున్నాయి మరి మీ సినిమాని ఎందుకు చూపించలేదు అని అందులో ప్రశ్నించగా.. నా సినిమా కంటెంట్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది అందుకే నేను సినిమాను చూపించడానికి నిరాకరించాను ఆ తర్వాత ఏం జరుగుతుందో అది చూడాలి అని మంచు విష్ణు అన్నారు.. ఈ చిత్రాన్ని విడుదలకు ముందు ఏ ఓటీటీ సంస్థకు కూడా అమ్మాలని మేము అనుకోవట్లేదు. విడుదల తర్వాత మీరే భారీ రేట్స్ తో మా సినిమా రైట్స్ ని దక్కించుకోవడం కోసం పోటీ పడుతారు అని అన్నట్లు సమాచారం.. మొత్తానికి అయితే ఈ సినిమా ఓటిటి రైట్స్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు.. మరి సినిమా రిలీజ్ లోపల మంచి విష్ణు నిర్ణయం మార్చుకుంటాడేమో చూడాలి..