Inzamam-ul-Haq On 2027 World Cup: 2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) వచ్చే ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సెప్టెంబర్ మాసంలో మెగా టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో వేదికలను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన కూడా చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (International Cricket Council). మొత్తం 12 వేదికలను ఖరారు చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. టీమిండియా ఆడే మైదానాలు కూడా ఖరారు అయ్యాయి. ఇండియన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న స్టేడియాలను టీమిండియా ( Team India) కోసం సిద్ధం చేస్తున్నారు. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ( Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా సులభంగా గెలిచే మైదానాలను ఐసీసీ కేటాయించిందని సంచలన ఆరోపణలు చేశారు. విరాట్ కోహ్లీతో (Virat Kohli) పాటు రోహిత్ శర్మ ( Rohit Sharma) సులభంగా బ్యాటింగ్ చేసే పిచ్ లు ఐసీసీ ( ICC) కేటాయించిందని బాంబు పేల్చారు. దీంతో ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో… వేదికలను ఖరారు చేస్తూ ఐసీసీ ప్రకటన చేసింది. అయితే ఇందులో టీం ఇండియా ఆడే వేదికలు కూడా ఖరారు అయ్యాయి. దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ హాట్ కామెంట్స్ చేశారు. టీమిండియా సులభంగా గెలిచే మైదానాలను మాత్రమే కేటాయించినట్లు బాంబు పేల్చారు. మొన్నటి వరకు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఇండియాలో నిర్వహించి.. ఐసీసీ కుట్ర చేసిందని ఫైర్ అయ్యారు.
ఫ్లాట్ మైదానాలు ఉండేలా చేసి.. 2026 ప్రపంచ కప్ టీమిండియా గెలిచేలా స్కెచ్ వేసిందని ఆరోపణలు చేశారు. దక్షిణాఫ్రికాలో 2027 వన్డే వరల్డ్ కప్ జరగబోతున్న నేపథ్యంలో.. టీమిండియా కు అనుకూలంగా ఉండే మైదానాలు ఫైనల్ చేసి మరో కుట్రకు ఐసీసీ తెరలేపినట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారి టీమిండియా కు అనుకూలంగానే ఐసీసీ వ్యవహరిస్తోందని.. అందుకే వాళ్లకు వరుసగా ట్రోఫీలు వస్తున్నాయని నిప్పులు చెరిగారు. దీనిపై కచ్చితంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు ఇంజమామ్ ఉల్ హక్.
2027 వన్డే వరల్డ్ కప్ కోసం మొత్తం 12 వేదికలు ఖరారు అయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే అలాగే నమీబియా వేదికల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో జోహన్నెస్ బర్గ్, కేప్ టౌన్, డర్బన్ లాంటి మైదానాలు ఉన్నాయి. హరారే వేదికలో కూడా టీమిండియా ఆడనుంది. అయితే ఈ అన్ని మైదానాలలో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. దక్షిణాఫ్రికాలో టీమిండియా ఆడే మైదానాలలో విరాట్ కోహ్లీ మొత్తం 25 మ్యాచ్ లు ఆడగా… ఇందులో మొత్తం 1358 పరుగులు సాధించాడు. ఐదుసార్లు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు. 9 సెంచరీలతో పాటు నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి.