E-Paper
Advertisement

ఏథర్ సూపర్ సర్‌ ప్రైజ్.. కొత్త EL స్కూటర్‌ లాంచ్ డేట్ ఫిక్స్!

ఏథర్ సూపర్ సర్‌ ప్రైజ్.. కొత్త EL స్కూటర్‌ లాంచ్ డేట్ ఫిక్స్!
Advertisement

UpcomingAther EL Scooter: ఏథర్ ఎనర్జీ  కొత్త EL ప్లాట్‌ ఫామ్ ఆధారిత ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను మరోసారి టీజ్ చేసింది. అదే సమయంలో ఈ స్కూటర్ లాంచ్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. దీనిని ఆగస్టు 29న జరగనున్న ఏథర్ కమ్యూనిటీ డే కార్యక్రమంలో అధికారికంగా మార్కెట్ కు పరిచయం చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ లో తయారీ కేంద్రంలో స్కూటర్ అసెంబ్లీని చూపించిన కంపెనీ, ఈసారి కొత్త టీజర్‌లో స్కూటర్ పూర్తి డిజైన్‌ ను మరింత స్పష్టంగా చూపించింది.

కొత్త టీజర్ ఏం చెప్తుందంటే?

తాజా టీజర్‌ను చూస్తే, గత ఏడాది ఏథర్ కమ్యూనిటీ డేలో ప్రదర్శించిన EL01 కాన్సెప్ట్ ఆధారంగానే ఈ ప్రొడక్షన్ మోడల్ రూపొందినట్లు తెలుస్తోంది. స్కూటర్ డిజైన్ చాలా సింపుల్‌ గా, మోడ్రన్ గా కనిపిస్తోంది. స్మూత్ బాడీ ప్యానెల్స్, ఫ్లాట్ ఫ్లోర్‌ బోర్డ్, పొడవైన సింగిల్ పీస్ సీటు, పిలియన్ కోసం కొద్దిగా ఎత్తుగా ఉండే సీటు డిజైన్ ఇందులో కనిపిస్తున్నాయి. ముందు భాగంలో హారిజాంటల్ LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ తో కూడిన కాంపాక్ట్ LED హెడ్‌ ల్యాంప్‌ ను ఏర్పాటు చేశారు. దీంతో స్కూటర్‌కు స్టైలిష్ లుక్ వచ్చింది.

Advertisement

ఈ కొత్త స్కూటర్ కు సంబంధించిన టెక్నికల్ వివరాలను ఏథర్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, టెస్టింగ్ సమయంలో కనిపించిన మోడళ్ల ఆధారంగా కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఈ స్కూటర్‌లో ముందు 14 అంగుళాల అలాయ్ వీల్, వెనుక 12 అంగుళాల అలాయ్ వీల్ ఉండే అవకాశం ఉంది. బ్రేకింగ్ కోసం ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ సెటప్ ఇవ్వవచ్చని సమాచారం. ఇందులో 7 అంగుళాల TFT డిస్‌ ప్లే ఉండే అవకాశం ఉంది. ఈ డిస్‌ ప్లే ద్వారా స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, కాల్ అలర్ట్స్, ఇతర కనెక్టెడ్ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.

ఈ కొత్త స్కూటర్‌ ను ఏథర్ పూర్తిగా కొత్త EL ప్లాట్‌ఫామ్ మీద అభివృద్ధి చేసింది. భవిష్యత్తులో ఇదే ప్లాట్‌ ఫామ్‌ పై మరిన్ని స్కూటర్లను తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఈ ప్లాట్‌ ఫామ్‌లో 2 kWh నుంచి 5 kWh వరకు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌ లను అమర్చే అవకాశం ఉంటుంది. దీంతో తక్కువ ధర నుంచి ప్రీమియం మోడళ్ల వరకు విభిన్న వేరియంట్లను తయారు చేయడం కంపెనీకి ఈజీ అవుతుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో సత్తా చాటేలా..

Advertisement

భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మరింత సత్తా చాటేలా ఏథర్ ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కంపెనీ స్కూటర్లతో పోలిస్తే, ఈ కొత్త EL ఆధారిత మోడల్ అత్యంత సరసమైన ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం ఈ స్కూటర్ ధర రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షల (ఎక్స్‌ షోరూమ్) మధ్య ఉండవచ్చు. అధికారిక ధర, పూర్తి ఫీచర్లు, బ్యాటరీ వివరాలు ఆగస్టు 29న జరిగే ఆవిష్కరణ కార్యక్రమంలో వెల్లడికానున్నాయి.

Read Also: విడా నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

దీపావళి సీజన్‌లో కొత్త కార్ల జాతర.. మారుతి, హ్యుందాయ్ నుంచి వస్తున్న కొత్త మోడళ్లు ఇవే!

హీరో నుంచి కొత్త బైక్.. క్యూరియాసిటీ పెంచుతున్న లేటెస్ట్ స్పై షాట్స్!

క్రాష్ టెస్ట్‌ లో దుమ్మురేపిన మహీంద్రా XUV 7XO.. అన్ని వేరియంట్లకు 5 స్టార్ రేటింగ్!

స్పోర్టీ లుక్.. అదిరిపోయే స్పీడ్.. భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×