E-Paper
Advertisement

మార్కెట్‌‌లో కొత్త ఫ్రిజ్ రచ్చ.. ఫీచర్లు చూస్తే మతిపోతుంది బాస్

మార్కెట్‌‌లో కొత్త ఫ్రిజ్ రచ్చ.. ఫీచర్లు చూస్తే మతిపోతుంది బాస్
Advertisement

Mitashi 345 L double door refrigerator: ఇళ్లలో నిత్యవసర వస్తువులు, పండ్లు, కూరగాయలు, డ్రింక్స్ తాజాగా ఉంచుకోవడానికి ఒక మంచి ఫ్రిజ్ ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా నలుగురు లేదా అంతకంటే.. ఎక్కువ మంది ఉండే  కుటుంబాలకు ఎక్కువ కెపాసిటీ ఉన్న డబుల్ డోర్ ఫ్రిజ్ తప్పనిసరి. అలాంటి వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న మోడల్.. మిటాషి (Mitashi) 345 లీటర్ల ఫ్రాస్ట్-ఫ్రీ డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్. దీని ఫీచర్లు, ధరలకు సంబంధించిన మరిన్ని వివరాలు..

మిటాషి ఫ్రాస్ట్-ఫ్రీ డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ ఫీచర్లు:

భారీ కెపాసిటీ, స్పేసియస్ డిజైన్:

ఈ రిఫ్రిజిరేటర్ 345 లీటర్ల భారీ సామర్థ్యంతో వస్తుంది. దీని వల్ల వంట గదిలో కావాల్సిన కూరగాయలు, పండ్లు, పాలు,పెద్ద బాటిళ్లను ఎంతో ఈజీగా సర్దుకోవచ్చు. ఫ్రిజ్ లోపల ఉన్న గ్లాస్ షెల్ఫ్‌లు చాలా బలంగా ఉంటాయి. కాబట్టి ఇవి బరువైన పాత్రల బరువును కూడా ఈజీగా మోయగలవు. సిల్వర్ కలర్ డిజైన్ కారణంగా.. ఇది మీ కిచెన్ ఇంటీరియర్‌కు ఒక ట్రెండీ, ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.

ఫ్రాస్ట్-ఫ్రీ కూలింగ్ టెక్నాలజీ:

Advertisement

ఇది ఫ్రాస్ట్-ఫ్రీ టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే.. ఫ్రిజ్ ఫ్రీజర్‌లో ఎక్కడా మంచు గడ్డకట్టదు. దీని వల్ల డీఫ్రాస్ట్ చేయాల్సిన ఇబ్బంది ఉండదు. అంతే కాకుండా లోపల ఉన్న కూలింగ్ అన్ని భాగాలకు సమానంగా అందుతుంది. ఆహార పదార్థాలు కుళ్ళిపోకుండా.. చాలా రోజుల పాటు తాజాగా, సువాసన వెదజల్లేలా ఇది కాపాడుతుంది. కూరగాయలు ఎండిపోకుండా.. ఫ్రెష్‌గా ఉంచడానికి ప్రత్యేకమైన వెజిటెబుల్ బాక్స్ కూడా ఇందులో ఉంది.

Also Read: బడ్జెట్ ప్రైస్‌లో బెస్ట్ వాషింగ్ మెషీన్..ఆఫర్ ఉన్నప్పుడే కొనేయండి

నాణ్యత:

Advertisement

మిటాషి బ్రాండ్ తన ప్రొడక్ట్స్ లో నాణ్యతకు ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ మన్నికైన మెటీరియల్‌తో తయారైంది కాబట్టి ఎక్కువ కాలం పాటు పాడవకుండా ఉంటుంది. అలాగే శక్తివంతమైన కంప్రెసర్ దీని సొంతం. ఇది తక్కువ శబ్దంతో.. చాలా సైలెంట్‌గా పని చేస్తుంది. కరెంట్ బిల్లుల గురించి ఆలోచించే వారికి ఇది 2-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది కాబట్టి సమర్థవంతంగా పని చేస్తుంది.

బడ్జెట్ ధరలో గొప్ప ఆప్షన్:

మార్కెట్లో ఉన్న ఇతర ప్రముఖ బ్రాండ్ల 350 లీటర్ల డబుల్ డోర్ ఫ్రిజ్‌లతో పోలిస్తే.. మిటాషి ధర చాలా తక్కువగా ఉంటుంది. ఆన్‌లైన్ ఆఫర్లు, సేల్స్‌లో ఇది కేవలం రూ.25,490 ధరకే లభిస్తుండటం గమనార్హం. తక్కువ బడ్జెట్‌లో.. ఎక్కువ స్పేస్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కోరుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది నిజంగా గొప్ప అవకాశం.

తక్కువ ఖర్చులో పెద్ద కుటుంబానికి సరిపోయే.. చక్కటి డబుల్ డోర్ ఫ్రిజ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే.. Mitashi 345 L Frost-Free Double-Door Refrigerator ఒక అద్భుతమైన ఆప్షన్ అవుతుంది. దీని కూలింగ్, విశాలమైన స్పేస్ , బడ్జెట్ ధర అన్నీ కలిసి వచ్చే ఈ ఫ్రిజ్ మీ ఇంటికి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.

Related News

కీబోర్డ్‌లో ‘స్పేస్ బార్’ అంత పెద్దగా ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే!

ఫోన్ కెమెరా బాగున్నా ఫోటోలు బాగా రావడం లేదా? ఈ తప్పులు వెంటనే మానేయండి!

ఫ్రిజ్ లైఫ్ పెరగాలంటే.. ఈ చిన్న పని చేయాల్సిందే!

స్పోర్ట్స్ ఇయర్‌బడ్స్ కొనేముందు..ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!

చాటింగ్ సీక్రెట్స్..ఆన్‌లైన్‌లోకి రాకుండానే వాట్సాప్ మెసేలు చదవడం ఎలా?

డిలీట్ అయిన ఫోటోలు మళ్లీ కావాలా? ఈ సీక్రెట్ సెట్టింగ్ మీ కోసమే

బెస్ట్ బ్లూటూత్ స్పీకర్..ఏఐ సౌండ్‌తో ఇల్లు దద్దరిల్లిపోతుంది

పాత టీవీ రిమోట్ పారేస్తున్నారా? ఈ 6 ట్రిక్స్ తెలిస్తే.. ఇంకెప్పుడు ఆ తప్పు చేయరు!

Big Stories

Advertisement
×