E-Paper
Advertisement

IPL 2023: బోణీ కొట్టిన పంజాబ్, లక్నో.. 5 వికెట్లతో అదరగొట్టిన వుడ్

IPL 2023: బోణీ కొట్టిన పంజాబ్, లక్నో.. 5 వికెట్లతో అదరగొట్టిన వుడ్
Advertisement

IPL 2023: ఐపీఎల్ 16 సీజన్‌లో భాగంగా శనివారం మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై పంజాబ్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. కోల్‌కతాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

భానుక రాజపక్స 32 బంతుల్లో 50 పరుగులు చేయగా.. శిఖర్ ధవన్ 40 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్ టిమ్ సాథీ రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. అదే సమయంలో భారీగా వర్షం పడడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆర్ష్‌దీప్ సింగ్‌ దక్కించుకున్నాడు.

Advertisement

ఇక శనివారం జరిగిన రెండో పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 48 బంతుల్లో 56 పరుగులతో రాణించాడు. లక్నో బౌలర్ వుడ్ ఒక్కడే 5 వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వుడ్‌కు దక్కింది.

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×