ipl 2023 winner Price money : క్రికెట్ చరిత్రలోనే రిచెస్ట్ టోర్నమెంట్ ఐపీఎల్. దీని రేంజ్ ఎంతంటే… కొన్నేళ్లలో ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను కూడా వెనక్కి నెట్టి వాల్యూ ఎడిషన్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండబోతోంది. అంతటి రిచెస్ట్ టోర్నీకి ప్రైస్ మనీ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఆదివారం నాడు గెలిచే విజేతకు కప్‌తో పాటు ప్రైస్ మనీ, రన్నరప్‌తో పాటు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలకు కూడా భారీ మొత్తంలో ప్రైస్ మనీ ఇవ్వబోతున్నారు.
ఐపీఎల్ 2023 విన్నర్‌కు ఇచ్చే ప్రైస్ మనీ 20 కోట్ల రూపాయలు. గత సీజన్‌లోనూ ఇంతే మొత్తం ఇచ్చారు. ఈసారి కూడా నో ఛేంజ్. ఇక రన్నరప్‌కు 13 కోట్ల రూపాయలు ఇస్తారు. థర్డ్ ప్లేస్‌లో ఉన్న జట్టుకు కూడా ప్రైస్ మనీ అందుతుంది. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న జట్టు ముంబై ఇండియన్స్. ఈ జట్టుకు ప్రైస్ మనీ కింద వచ్చేది 7 కోట్ల రూపాయలు. అంతేకాదు, ఎలిమినేషన్ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టుకు కూడా మనీ ఇస్తారు. ఈసారి ఎలిమినేటర్ లక్నో సూపర్ జెయింట్స్. ఈ జట్టుకు చెల్లించే క్యాష్ రివార్డ్ 6.5 కోట్ల రూపాయలు.
ఐపీఎల్ 2023లో హైయెస్ట్ రన్స్ చేసిన ఆరేంజ్ క్యాప్ హోల్డర్‌కు 15 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తారు. ఈ లిస్టులో ఉన్నది మరెవరో కాదు గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్. చెన్నై తరపున బ్యాట్స్‌మెన్ ఎంత చితక్కొట్టినా గిల్ చేసిన 851 పరుగులను అందుకోవడం అసాధ్యం. ఇక పర్పుల్ క్యాప్ బౌలర్‌కు కూడా 15 లక్షలు అందిస్తారు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసి బౌలర్ మహ్మద్ షమీ. మొత్తం 28 వికెట్లు తీశాడు. అయితే, షమీకి పోటీగా రషీద్ ఖాన్, మొహిత్ శర్మ కూడా ఉన్నారు. రషీద్ 27 వికెట్లు, మొహిత్ శర్మ 24 వికెట్లు తీశారు. సో, పర్పుల్ క్యాప్ ఎవరికి దక్కుతుందో ఆదివారమే తేలుతుంది.
ఇక ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌కు 20 లక్షలు, మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్‌కు 12 లక్షలు, పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌కు 15 లక్షలు, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్‌కు 15 లక్షలు, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్‌కు 12 లక్షలు ఇస్తారు.