Big Stories

NTR : ఎన్టీఆర్ కు మోదీ వందనం.. మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రశంసలు..

NTR : నందమూరి తారక రామారావు కోట్లాది ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారని ప్రధాని మోదీ అన్నారు. 101వ మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. ఈ సమయంలో శత జయంతి వేళ ఎన్టీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. రాజకీయాలతోపాటు చిత్రరంగంలో తన ప్రతిభతో ఆ మహనీయుడు చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. తన నటనాకౌశలంతో ఎన్నో చరిత్రాత్మక పాత్రలకు ఎన్టీఆర్‌ జీవం పోశారని గుర్తు చేశారు.

- Advertisement -

బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్‌ సినీరంగంలో పేరు తెచ్చుకున్నారని మోదీ కొనియాడారు. కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారన్నారు. 300పైగా చిత్రాల్లో నటించి అలరించారని పేర్కొన్నారు. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్‌ నటనను ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారని మోదీ చెప్పారు.

- Advertisement -

దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చే 25 ఏళ్లు చాలా కీలకమని మోదీ అన్నారు. ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ్‌ భారత్‌ నినాదాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. యువ సంగమం పేరుతో విద్యాశాఖ ఓ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ప్రజలతో మమేకం చేయడం ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రధాని మోదీ తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News