Big Stories

GT vs CSK Records: ఐపీఎల్‌లో సంచలనం.. తొలి వికెట్‌కు రికార్డ్ భాగస్వామ్యం

Gujarat Titans vs Chennai Super Kings Match 59 IPL 2024:శుక్రవారం అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2024 మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓపెనర్లు సెంచరీ చేయడం విశేషం. గిల్ 55 బంతుల్లో 6 సిక్సర్లు 9 ఫోర్ల సాయంతో 104 పరుగుల చేయగా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ 51 బంతుల్లో 7 సిక్సర్లు 5 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేశారు.

- Advertisement -

ఇద్దరు గుజరాత్ ఓపెనర్లు తొలి వికెట్‌కు 210 పరుగులు జోడించి తొలి వికెట్ కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జంటగా లక్నో ఓపెనర్లు సరసన చేరారు. కాగా 2022లో కోల్ కతా నైట్ రైడర్స్‌పై లక్నో ఓపెనర్లు కేఎల్ రాహుల్, డి కాక్ 210 పరుగులు జోడించారు.

- Advertisement -

ఇక గుజరాత్ టైటాన్స్ తరఫున ఏ వికెట్ కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గిల్,వృద్ధిమాన్ సాహా తొలి వికెట్‌కు 142 పరుగులు జోడించారు.

ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసి 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News