Big Stories

GT vs SRH: రాణించిన సాయి సుదర్శన్.. టైటాన్స్ ఘనవిజయం..

Gujarat Titans Vs Sunrisers Hyderabad
Gujarat Titans Vs Sunrisers Hyderabad

Gujarat Titans vs Sunrisers Hyderabad: అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ ఘనవిజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి చేధించింది.

- Advertisement -

అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ 3 వికెట్లు తీసుకుని సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు.

- Advertisement -

163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా వృద్ధిమాన్ సాహా 13 బంతుల్లోనే 25 పరుగులు చేసి షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మరో వైపు గిల్ 36 పరుగులు చేసిన తర్వాత మార్కండే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 16 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. 24 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన సమయంలో సాయి సుదర్శన్ (45) భారీ షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు. విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్ లాంఛనాన్ని పూర్తి చేశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. భీకరమైన ఫామ్‌లో ఉన్న హెడ్ బౌండరీలతో చెలరేగాడు. ఈ దశలో 16 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 19 పరుగులు చేసిన హెడ్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అభిషేక్ శర్మ 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసి కష్టాల్లో పడింది.

ఆ తర్వాత 13వ ఓవర్లో క్లాసెన్ రెండు సిక్సర్లు బాదడంతో హైదరాబాద్ స్కోర్ 100 దాటింది. 14వ ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లాసెన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 15వ ఓవర్లలో మార్క్‌రమ్ అవుట్ అయ్యాడు. చివర్లో సమద్, షాబాజ్ అహ్మద్ రాణించడంతో 20 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News