BigTV English

IPL 2024: ఐపీఎల్ 2024.. రెండు మ్యాచ్‌లు రీషెడ్యూల్..

IPL 2024: ఐపీఎల్ 2024.. రెండు మ్యాచ్‌లు రీషెడ్యూల్..
IPL 2024
IPL 2024

IPL 2024: ఐపీఎల్ 2024లో రెండు మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఏప్రిల్ 17న ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను ఒక రోజు ముందుకు రీషెడ్యూల్ చేసినట్లు బీసీసీఐ సోమవారం పేర్కొంది.


అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గుజరాత్ టైటాన్స్ పోరు ఇప్పుడు ఏప్రిల్ 17న జరగనుంది. ముందుగా ఈ మ్యాచ్ ఏప్రిల్ 16న జరగాల్సి ఉంది.

బెంగాల్‌లో ఎన్నికలు, శ్రీరామనవమి ఉన్నందున భద్రత ఇవ్వలేమని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. దీంతో బీసీసీఐ రెండు మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేసింది.


ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ గతంలో రెండు దశల్లో ప్రకటించింది. మొదట్లో 21 మ్యాచ్‌లకు షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత మిగిలిన 53 మ్యాచ్‌ల టైమ్‌టేబుల్‌ను వెల్లడించింది.

12 ఏళ్ల తర్వాత చెన్నై తొలిసారి ఐపీఎల్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా ఐపీఎల్ ఫైనల్ మార్చి 26న జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు నిలయమైన M.A. చిదంబరం స్టేడియం ఇంతకు ముందు రెండుసార్లు 2011, 2012లో IPL ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చింది.

Related News

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Indian Cricketers: ఆ ఒక్క నిర్ణయం… టీమిండియా క్రికెటర్లకు రూ.250 కోట్ల నష్టం!

Shubman Gill: సారాతో డేటింగ్… టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి…చిల్ అవుతున్న గిల్ ?

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×