BigTV English

Good Interest Rate Investments: డబ్బులు సంపాదించుడు కాదు.. ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం బిగులు!

Good Interest Rate Investments: డబ్బులు సంపాదించుడు కాదు.. ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం బిగులు!
Investments
Good Interest rate Investments  

Good Interest Rate Investments: డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు. అది సరైన రీతిలో పెట్టుబడిపెడితే సంపాదన రెట్టింపు అవుతుంది. ప్రస్తుత కాలంలో అనేక పెట్టుబడి మార్గాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇవి అన్ని వర్గాల వారికి ఉపయోడపడేలా ప్రభుత్వం రూపొందంచింది. దాదాపుగా దాదాపు అన్ని ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్ గవర్నమెంట్-బ్యాక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లను అందిస్తున్నాయి. ఈ స్కీమ్‌లు సుస్థిరమైన, సురక్షితమైన రాబడిని ఇస్తాయి. సాధారణంగా ప్రభుత్వాలు ప్రతి మూడేళ్లకు ఒకసారి స్కీమ్‌ల వడ్డీ రేట్లను అప్‌గ్రేడ్ చేస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరం FY25 (2024 ఏప్రిల్-జూన్ ) ప్రారంభ త్రైమాసికంలో 2024 జనవరి- మార్చి త్రైమాసికంలో నిర్ణయించిన వడ్డీ రేట్లను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.


కేంద్ర ప్రభుత్వం 2024 జనవరి-మార్చిలో పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లను పెంచింది. 10-20 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ పాపులర్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌పై ప్రస్తుత ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఎంత శాతం రాబడి లభిస్తుందో తెలుసుకోండి.

పోస్టాఫీసు సేవింగ్ అకౌంట్..


ఈ స్కీమ్ కింద మినిమం డిపాజిట్ రూ.500తో అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. డిపాజిట్ విషయంలో పరిమితి ఏమి లేదు. పెద్దవారు లేదా మైనర్ తరఫున ఇండివిడ్యువల్ లేదా జాయింట్ అకౌంట్‌‌ను
ఓపెన్‌ చేసుకోవచ్చు. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్లు స్వతంత్రంగా అకౌంట్‌‌ను ఉపయోగించవచ్చు. ఈ స్కీమ్ 4 శాతం వడ్డీని ఇస్తుంది.

నేషనల్ సేవింగ్‌ స్కీమ్‌..

ఈ స్కీమ్ కింద మినిమం డిపాజిట్ రూ. 1000తో అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. ఈ స్కీమ్ కింద
గరిష్టంగా అకౌంట్ సింగిల్ అయితే రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్‌లో రూ.15 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిటర్ మల్టిపుల్‌ అకౌంట్స్‌ ఓపెన్‌ చేసుకునే సౌకర్యం ఉంటుంది.
ఒకటి లేదా మూడు సంవత్సరాల ముందు శాతం డిడక్షన్ ఉంటుంది. మూడు సంవత్సరాల తర్వాత 1 శాతం డిడక్షన్‌తో అకౌంట్‌ ప్రీమెచ్యూర్‌గా క్లోజ్‌ చేయవచ్చు. 2024 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు 7.4 శాతం వడ్డీని పొందొవచ్చు.

Also Read: కొత్త ఆదాయపు పన్ను పాలసీ ఫేక్.. ఎలాంటి మార్పులు లేవ్

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్..

ఈ స్కీమ్‌లో మినిమం డిపాజిట్ అమౌంట్‌ రూ.1000గా ఉంది. ఇది సీనియర్ సిటీజన్లకు సురక్షితమైన మార్గం. ఈ స్కీమ్ 8.20 శాతం వార్షిక వడ్డీని అందిస్తుంది. తాజాగ ప్రభుత్వం ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిట్‌ని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పెంచింది.

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్..

మహిళా సమ్మాన్ సేవింగ్‌ సర్టిఫికేట్ స్కీమ్ అనేది పొదుపును ప్రోత్సహించడం లక్ష్యంతో రూపొందించబడిన స్కీమ్. ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.5 శాతంగా ఉంది. గరిష్టంగా 2 సంవత్సరాల కాలపరిమితితో వస్తుంది. కనీసం వార్షిక పెట్టుబడి రూ.1000గా ఉంది. వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది.

కిసాన్ వికాస్ పత్ర..

ఈ స్కీమ్‌కు సంబంధించి రూ.1000తో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ పథకం కింద 113 నెలల వ్యవధిలో సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. పెట్టుబడిని పదవీకాలం ఆధారంగా నిర్ణయిస్తారు. మెచ్యూరిటీపై క్యాపిటల్‌ గెయిన్స్‌కు ట్యాక్స్‌ ఎగ్జమ్షన్‌ లభిస్తుంది.

Also Read: పీఎఫ్ కొత్తరూల్.. ఎన్ని ఉద్యోగాలు మారినా ప్రాబ్లమ్ ఉండదట..!

రికరింగ్ డిపాజిట్..

ఈ స్కీమ్ మినిమం డిపాజిట్‌గా రూ. 100 ఉంది. అకౌంట్ 5 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్‌ రేటుతో 3 సంవత్సరాల తర్వాత ప్రీ మెచ్యూర్‌గా క్లోజ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం 5 సంవత్సరాల RDపై 6.7 శాతం వడ్డీ రేటు లభిస్తోంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్..

స్కీమ్‌లో మినిమం డిపాజిట్‌ అమౌంట్‌ రూ.1000. గరిష్ఠ పరిమితి లేదు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకం సంవత్సరానికి 7.7% వడ్డీ రేటు ఇస్తోంది. 5 సంవత్సరాల కాలవ్యవధితో వస్తుంది. పెట్టుబడి మొత్తం టెన్యూర్‌ ఆధారంగా నిర్ణయిస్తారు. వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించాలి.

సుకన్య సమృద్ధి యోజన..

ఈ స్కీమ్‌ను బాలికల ఉన్నత విద్యా, వివాహం కోసం సేవింగ్స్ చేసుకునేందుకు తీసుకొచ్చారు. దీనిపై సంవత్సరానికి 8.20 శాతం అకర్షణీయమైన వడ్డీ రేటు లభిస్తోంది. ఈ రేట్లు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తోంది. ఈ రేట్లు 2024 ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు అమల్లో ఉండనున్నాయి. గరిష్టంగా 21 సంవత్సరాల కాలపరిమితితో వస్తుంది. మంత్లీ మినిమం డిపాజిట్‌ అమౌంట్‌ రూ.250గా ఉంది.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×