Is MS Dhoni’s 110 Meter Six Reason for the Lost CSK against RCB: ప్లే ఆఫ్స్ కి చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు విజయం చెన్నైపై విజయం సాధించింది. అయితే ఈ విజయానికి కారణం మాత్రం చివరి ఓవర్లో ధోని కొట్టిన సిక్స్ అనే అంటున్నారు క్రీడాభిమానులు, క్రికెట్ విశ్లేషకులు. అదేంటి ధోని సిక్స్ కొడితే ఆర్సీబీ గెలవటం ఏంటి అనుకుంటున్నారా. అయితే చూద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే చివరి ఓవర్లో 17 పరుగులు కావాలి. అప్పటికే క్రీజులో ఇద్దరు ఆటగాళ్లు రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని నిలదొక్కుక్కున్నారు. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లో టెన్షన్. ఎందుకంటే అక్కడ ఉన్నది ఫినిషర్ మహేంద్రుడు.
ఆర్సీబీ కెప్టెన్ డ్యూ ప్లెసిస్ చివరి ఓవర్ యశ్ దయాల్ కు ఇచ్చాడు. అప్పటికే బ్యాటింగ్ కు సమకరిస్తున్న పిచ్‌పై చెన్నై బ్యాటర్లు ప్లే ఆఫ్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించారు.
చివరి ఓవర్ తొలి బంతికే ధోని అద్భుతమైన సిక్స్ కొట్టాడు. వెయిస్ట్ హైట్ కి కొంచెం తక్కువగా వచ్చిన ఫుల్ టాస్ బాల్ ను ధోని ఫైన్ లెగ్ వైపు 110 మీటర్ల సిక్స్ బాదాడు. అది కాస్త చిన్నస్వామి స్టేడియం అవుతల పడింది. దీంతో అంపైర్లు మరో బాల్ ఇచ్చారు. ఆ బాల్ కాస్త గ్రిప్ అవడంతో ఇంకేముంది ఆ తరువాత బంతికి ధోని అవుట్.. ఆ తరువాత 4 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. దీంతో ఆర్సీబీ సంచలన విజయం నమోదు చేసింది. దీంతో వరుసగా ఆరు మ్యాచులు గెలిచి ప్లే ఆఫ్ బెర్తును సొంతం చేసుకుంది.
Also Read: ఎట్టకేలకు ప్లే ఆఫ్ కి.. కోహ్లీ ఉద్వేగభరిత క్షణాలు
ఇదే విషయాన్ని ఆర్సీబీ కెప్టెన్ డ్యూ ప్లెసిస్ కూడా ధృవీకరించాడు. చివరి ఓవర్ తొలి బంతికి యార్కర్ వేయాలని నిర్ణయించుకున్నమని.. కానీ బాల్ తడిగా ఉండటంతో స్లిప్ అయ్యి ఫుల్ టాస్ పడిందని అన్నాడు. ఒక వేళ ఆ బాల్ స్టేడియం అవల పడకుంటే చెన్నై గెలిచే అవకాశం ఉండేదన్నారు. దీంతో ధోని సీఎస్కే కొంప ముంచాడని నెటిజన్లు, చెన్నై అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Dhoni hitting 110 m SIX to end his IPL career pic.twitter.com/5MdR99vBuW
— Prince of Hastinapur (@duryodan_) May 18, 2024