BigTV English

Blue Meteor in Sky: ఆకాశంలో అద్భుతం.. భూమిపైకి దూసుకొచ్చిన ఉల్క!

Blue Meteor in Sky: ఆకాశంలో అద్భుతం.. భూమిపైకి దూసుకొచ్చిన ఉల్క!

Blue Meteor in Spain and Portugal Sky: స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో ప్రజలు ఓ అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. నీలి రంగులో మెరుస్తూ ఉల్క ఒకటి భూమి మీదకు దూసుకువచ్చింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్డుపై వెళ్లే వారితో పాటు, వివిధ ప్రాంతాల్లో పార్టీలు జరుపుకుంటున్న వారు ఈ దృశ్యాలను తమ కెమరాల్లో బంధించారు.


ఉల్కాపాతం.. చాలా మంది ఈ పేరు విని ఉంటారు. ఆకాశం నుంచి ప్రకాశవంతంగా దూసుకొస్తూ భూమి మీద పడే సమయంలో ఇవి అద్భుతంగా కనిపిస్తాయి. అయితే శనివారం ఇలాంటి సంఘటనను స్పెయిన్ , పోర్చుగల్ దేశాల ప్రజలు చూసి అనుభూతిని పొందారు. మొదట ఉల్క భూమిపైకి వస్తున్న సమయంలో దానిని చూసిన వారు సూపర్ పవర్ ఏమైనా భూమి మీదకు దూసుకువస్తుందా? అని అనుకున్నారట. ఉల్కాపాతం గురించి వినడమే కాని చూసిన వారు చాలా తక్కువ. ఈ దృశ్యాలు చూసిన వారిలో కొందరు ఏలియన్ల పనేనా? అంటూ ఆశ్చర్యపోయారట.

ఈ ఉల్క ఎక్కడ పడింది అనే దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. కాని కొందరు మాత్రం కాస్ట్రో డెయిర్ లో పడిందని చెబుతుంటే మరికొందరు పిన్ హెచిరోలో పడిందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే రెండు వారాల క్రితమే అక్కడి ఖగోళ శాస్త్రవేత్తలు ఉల్క పడవచ్చని అంచనా వేసారు. అయితే మరి కొన్ని సార్లు హేలీ తోక చుక్క నుంచి వెలువడే శకలాల కారణంగా ఉల్కాపాతం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.


Also Read: ఆఫ్ఘనిస్థాన్ ను ముంచెత్తిన వర్షాలు, 50 మంది మృతి

 

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×