BigTV English

Rain Effects to RCB Vs CSK Match: ఆర్సీబీ – చెన్నై మ్యాచ్‌కు వరుణ గండం.. బెంగళూరు ఆశలపై నీళ్లు?

Rain Effects to RCB Vs CSK Match: ఆర్సీబీ – చెన్నై మ్యాచ్‌కు వరుణ గండం.. బెంగళూరు ఆశలపై నీళ్లు?

IPL 2024 68th Match – Rain Threat to Royal Challengers Vs Chennai Super Kings: చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు జల్లనున్నాడా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. శనివారం నాడు ఆర్సీబీ వర్సెస్ చెన్నయ్ మధ్య బెంగళూరులో మ్యాచ్ జరగనుంది. ఆరోజు ఉదయం నుంచి వర్షం పడే అవకాశాలున్నాయని, ఇక మ్యాచ్ ప్రారంభమయ్యే రాత్రి 7 గంటల ప్రాంతంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.


దీంతో ఆర్సీబీ జట్టులో గుబులు మొదలైంది. ఎందుకంటే ఆ మ్యాచ్ కచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్ రేస్ లో నిలుస్తుంది. లేదంటే తప్పుకుంటుంది. కాకపోతే ప్రస్తుతం 12 పాయింట్లతో మంచి రన్ రేట్ తో ఉంది. ఒకవేళ మ్యాచ్ గెలిస్తే 14 పాయింట్లతో, మిగిలిన 14 పాయింట్లు వచ్చిన జట్లతో ముందడుగులో ఉంటుంది. అందుకని ఆర్సీబీకి గెలవక తప్పని మ్యాచ్ అని చెప్పాలి. అయితే ఇక్కడ మ్యాచ్ జరిగి చెన్నయ్ గెలిస్తే గొడవ లేదు. అది 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కి వెళుతుంది. ఆర్సీబీ ఇంటికి వెళుతుంది.

కానీ ఆర్సీబీ గెలిస్తే మాత్రం అప్పుడు చెన్నయ్, ఆర్సీబీ, ఢిల్లీ 14 పాయింట్లతో ఉంటాయి. ఒకవేళ హైదరాబాద్ గానీ ఆడాల్సిన రెండు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచినా 16 పాయింట్లతో తను ప్లే ఆఫ్ కి వెళుతుంది. అప్పుడు మూడు జట్లు ప్లే ఆఫ్ లో ఉంటాయి. కోల్ కతా, రాజస్థాన్, హైదరాబాద్ పక్కా అవుతాయి. ఆఖరి జట్టు ఎవరనేది…ఆర్సీబీ వర్సెస్ చెన్నయ్ మధ్య జరిగే మ్యాచ్ తేలుస్తుంది.


Also Read: ఆర్సీబీకి అవకాశాలు ఉన్నట్టా..? లేనట్టా..?

తాజాగా గుజరాత్ వర్సెస్ కోల్ కతా మ్యాచ్ లో కూడా ఇలాగే జరిగింది. పాపం గుజరాత్ కి 14 పాయింట్లు రావల్సి ఉండగా ఆ అవకాశం కోల్పోయింది. ఒకవేళ చెన్నయ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య ఒకవేళ వర్షం పడితే, చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు 15 పాయింట్లతో చెన్నయ్ ప్లే ఆఫ్ రేస్ లోకి వెళ్లిపోతుంది. అదే ఆర్సీబీ 13 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంటుంది. ఒక్క వర్షం చూశారా? ఒక జట్టు జయాపజయాలపై ఎలాంటి ప్రభావం చూపించనున్నాడోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మొదట్లో ఆర్సీబీ 6 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. తర్వాత తేరుకుని వరుసగా విజయాలు సాధిస్తోంది. నాన్ స్టాప్ గా 5 మ్యాచ్ లు గెలిచి అసాధరణ రీతిలో ప్లే ఆఫ్ రేస్ లోకి వచ్చింది. ఇప్పుడు వరుణుడు ఆర్సీబీ.. ప్లే ఆఫ్ ప్లేస్ తో దోబూచులాడుతున్నాడు.

Tags

Related News

Sara Tendulkar :  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సచిన్ కూతురు సారా ?

Sri Lanka : అప్పుడు తండ్రులు దుమ్ము లేపారు… ఇప్పుడు కొడుకులు రంగంలోకి దిగారు.. శ్రీలంక జట్టుకు ఇక తిరుగులేదు

Smaran Ravichandran : SRH జట్టులో మరో మరో ఆణిముత్యం.. కావ్య పాపకు లక్ కలిసి వచ్చింది.. ఆ ప్లేయర్ ఎవరంటే

Varun-Shruti : టీమిండియా క్రికెటర్ కు దగ్గర అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్?

Dream11: టీమిండియాకు షాక్..తప్పుకున్న డ్రీమ్ 11.. కొత్త స్పాన్సర్ ఎవరంటే ?

Aus Vs SA : ఆస్ట్రేలియా విధ్వంసం.. 50 ఓవర్లలో 431 పరుగులు.. హెడ్ తో పాటు మొత్తం ముగ్గురు సెంచరీలు

Big Stories

×