BigTV English

Nindha Teaser Out: ఆకట్టుకుంటున్న వరుణ్ సందేశ్ ‘నింద’ టీజర్.. మీరే లుక్కేయండి..!

Nindha Teaser Out: ఆకట్టుకుంటున్న వరుణ్ సందేశ్ ‘నింద’ టీజర్.. మీరే లుక్కేయండి..!

Varun Sandesh Nindha Movie Teaser Out Now: హ్యాపీ డేస్ సినిమాతో తెలుగుతెరకు పరిచమయ్యాడు వరుణ్ సందేశ్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని ఇండస్ట్రీలో హీరోగా నిలబడ్డాడు. ఈ సినిమా తరువాత కొన్ని సినిమాల్లో నటించాడు కానీ, ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇక నటి వితికా షేరును వివాహమాడి కొన్ని ఏళ్లు సినిమాలకు దూరమయ్యాడు.


బిగ్ బాస్ వచ్చాకా సినిమాలకు దూరమైన వాళ్ళందరిని తీసుకొచ్చి హౌస్ లో కూర్చోపెట్టే సంప్రదాయం మొదలయ్యింది. అలా వరుణ్ సందేశ్ తన భార్య వితికాతో కలిసి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక హౌస్ నుంచి బయటికి వచ్చాకా మళ్లీ వరుణ్ సందేశ్.. హీరోగా సినిమాలు మొదలుపెట్టాడు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం నింద.

రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించి నిర్మిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, ఆనీ, భద్రం, సూర్య కుమార్, ఛత్రపతి శేఖర్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ను బట్టి ఇది వాస్తవిక సంఘటనలతో తెరకెక్కిన చిత్రంలా కనిపిస్తుంది. ” జీవితంలో కొన్నిసార్లు తప్పు అని తెల్సినా చేయకతప్పదు” అని తనికెళ్ల భరణి చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది.


Also Read: Prabhas and Payal : అక్కడ పాయల్.. ఇక్కడ ప్రభాస్.. ఏంటి మేటర్ ?

ఎక్కువ డైలాగ్స్ లేకుండా బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తోనే టీజర్ ను కట్ చేశారు. ఇక ఒక ప్రేమ జంట.. శవం.. ఆ నిండా హీరో మీద పడడం.. ఆ నిందను తొలగించుకోవడానికి హీరో ఏం చేశాడు.. ? అనేది కథగా తెలుస్తోంది. వరుణ్ చాలా మెచ్యూర్డ్ పాత్రలో కనిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో వరుణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×