BigTV English

Golden Cappuccino: ఐశ్వర్య రాజేష్ తాగిన ‘గోల్డెన్ క్యాపచినో’ ధర ఎంతో తెలుసా? దాన్ని ఎలా తయారు చేస్తారంటే?

Golden Cappuccino: ఐశ్వర్య రాజేష్ తాగిన ‘గోల్డెన్ క్యాపచినో’ ధర ఎంతో తెలుసా? దాన్ని ఎలా తయారు చేస్తారంటే?

Golden Cappuccino: తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందింది. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పలు సినిమాల ప్రమోషన్ల కోసం, వ్యక్తిగత పర్యటనల కోసం అమెరికాలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐశ్వర్య అమెరికాలోని.. ఒక ప్రముఖ కేఫ్‌లో “గోల్డెన్ క్యాపచినో” అనే ప్రత్యేక కాఫీని రుచి చూసింది. ఈ గోల్డెన్ క్యాపచినో రుచి.. కాఫీ ప్రియులను భలే ఆకర్షిస్తోందట. మరి ఆ కాఫీ విశేషాలేంటి? అసలు దాన్ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.


గోల్డెన్ క్యాపచినో ధర ఎంత?

గోల్డెన్ క్యాపచినో అనేది సాధారణమైన కాఫీ కాదు. దీనిని తయారు చేయడానికి ముఖ్యంగా.. ప్రీమియం కాఫీ బీన్స్, సేంద్రీయ పాలు, కొన్నిసార్లు బంగారు రేకులు (edible gold flakes) లేదా పసుపు వంటి ప్రత్యేక పదార్థాలు కలుపుతారు. అందువల్లనే ఈ కాఫీ ధర ఎక్కువగా ఉంటుంది. అమెరికాలోని వివిధ నగరాల్లో ఈ కాఫీ ధర $8 నుండి $15 (సుమారు ₹650 – ₹1250) వరకు ఉంటుంది. ముఖ్యంగా ఈ కేఫ్ లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ వంటి మెట్రో నగరాల్లో ఈ ధర మరింత ఎక్కువగా ఉంటుంది.


గోల్డెన్ క్యాపచినో తయారీ విధానం..

గోల్డెన్ క్యాపచినో తయారీలో కొన్ని ప్రత్యేకమైన పదార్ధాలను కలుపుతారు. అవి కాఫీ రుచితో పాటు.. కస్టమర్లను ఆకర్షించేలా చేస్తుంది.

ప్రీమియం కాఫీ బీన్స్: కాఫీ తయారు చేయడానికి అత్యంత నాణ్యమైన.. అరేబికా లేదా ఇథియోపియన్ కాఫీ గింజలను ఎంచుకుంటారు.

ఎస్ప్రెస్సో తయారీ: ఒక షాట్ లేదా రెండు షాట్ల ఎస్ప్రెస్సోను జాగ్రత్తగా తయారు చేస్తారు.

స్టీమ్డ్ మిల్క్: ప్రీమియం పాలను స్టీమ్ చేసి, క్రీమీ ఫోమ్‌ను కలుపుతారు.

పసుపు లేదా బంగారు రేకులు: అందులో రుచి కోసం ఒక చిటికెడు పసుపు (దీని వల్ల గోల్డెన్ రంగు వస్తుంది) లేదా ఆహార గ్రేడ్ బంగారు రేకులను కలుపుతారు.

స్పైసెస్: మంచి సువాసన కోసం దాల్చిన చెక్క, జాజికాయ, కేసరం వంటి సుగంధ ద్రవ్యాల పొడిని కాఫీపై చల్లుతారు.

ప్రెజెంటేషన్: ఒక అందమైన కప్పులో, కాఫీ ఫోమ్‌పై ఆకర్షణీయమైన లాటే ఆర్ట్‌తో సర్వ్ చేస్తారు.

ఈ కాఫీ రుచి మాత్రమే కాకుండా, దాని ఆకర్షణీయమైన రూపంతో కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే పలువురు.. ఈ రుచికరమైన కాఫీనీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.

Also Read: బ్యూటీ పార్లర్‌తో అవసరం లేకుండా.. ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్..

ఐశ్వర్య రాజేష్ కెరీర్ 

ఐశ్వర్య రాజేష్ తమిళ, తెలుగు, మలయాళం సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు పొందింది. ‘కాక ముట్టై’ (2014) , ‘వడ చెన్నై’ (2018), ‘కనా’ (2018) వంటి  పలు సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది. ఐశ్వర్య తొలిసారి రాంబంటు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ తర్వాత కౌసల్య కృష్ణమూర్తి, టక్ జగదీష్, రిపబ్లిక్ వంటి పలు సినిమాల్లో నటించింది. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం’ (2025) సినిమాలో వెంకటేశ్ సరసన.. భాగ్యం పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది.

 

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×