AP Tenth Results: ఏపీలో ఈ రోజు ఉదయం టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో మొత్తం 81.14 శాతం మంది పాసైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 1680 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి మే 28 వరకు జరగనున్నాయి.
ఫస్ట్ టైం 600 మార్కులు:
అయితే, ఈసారి ఏపీ పదో తరగతి ఫలితాల్లో కాకినాడ అమ్మాయి అరుదైన రికార్డు సాధించింది. 600కు 600 మార్కులు సాధించి యల్ల నేహాంజని రికార్డు సృష్టించింది. ఆమె కాకినాడలోని భాష్య పాఠశాలలో టెన్త్ క్లాస్ చదివింది. పదో తరగతి ఫలితాల్లో 600 మార్కులు సాధించడం ఇదే తొలిసారి అని అధికారులు చెబతున్నారు.
ఈసారి బాలికలదే పైచేయి..
అయితే ఈ సారి పదో తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురలో 78.31 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్ జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షలకు మొత్తం 6 లక్షల 14వేల 459 మంది విద్యార్థులు హాజరు అవ్వగా.. వారిలో 4లక్షల 98వేల 585 మంది పాసైనట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
మన్యం ఫస్ట్.. అల్లూరి లాస్ట్..
ఏపీ టెన్త్ ఫలితాల్లో 93.90 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఫలితాలను ప్రభుత్వం వైబ్ సైట్ లో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను వెబ్‌సైట్ https://results.bse.ap.gov.in/RES25/ , http://bse.ap.gov.in మాత్రమే కాకుండా మన మిత్ర వాట్సాప్ Send Hi 95523 00009, అలాగే LEAP Mobile App చూడొచ్చు.
Also Read: Viral Video : 434 / 440 మార్క్స్.. ఇంకా ఏడుస్తావేంది? తింగరి దానా..