Trump-IPL : ప్రస్తుతం పాకిస్తాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా భారత్ – పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తతలకు కాస్త తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఇవి అమలులోకి వచ్చినట్టు తెలిపింది. అంతకు ముందు ఇదే అంశం పై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని.. అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ప్రకటించారు. భారత విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిస్రీ కీలక విషయాలను వెల్లడించారు.
Also Read : Ambati Rayudu : కోహ్లీ రిటైర్మెంట్ పై అంబటి రాయుడు ట్రోలింగ్.. వద్దు బాస్ అంటూ
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ముఖ్యంగా శభాష్ ట్రంప్.. ఒకేసారి రెండు యుద్ధాలను ఆపేశావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా-పాకిస్తాన్ మధ్య జరుగబోయే యుద్ధాన్ని ఆపాడు ట్రంప్.. అలాగే అప్పట్లో గౌతమ్ గంభీర్ అలాగే కోహ్లీకి బాగా గొడవలు ఉండేవి. ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన తరహా లోనే కోహ్లీ అలాగే గంభీర్ గొడవలు ఉండేవి. అయితే.. ఇప్పుడు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధాన్ని ఆపింది ట్రంప్.. ఈ నేపథ్యంలోనే ట్రంపును మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు యుద్దం జరుగుతుందని కె.ఎల్. రాహుల్ ఫ్లయింగ్ ఆఫీసర్, శ్రేయస్ అయ్యర్ ఎయిర్ కమాండర్, ఎం.ఎస్. ధోనీ ఫ్లైట్ లూటెంట్ మికోయన్, గంతమ్ గంభీర్ గ్రూప్ కెప్టెన్, రాహుల్ ద్రవిడ్ ఎయిర్ చీఫ్ మార్షల్, రిషబ్ పంత్ ప్లయింగ్ ఆఫీసర్, రవీంద్ర జడేజా ఎయిర్ కమాండర్, రోహిత్ శర్మ స్కాడ్రోన్ లీడర్, విరాట్ కోహ్లీ గ్రూపు కెప్టెన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతలోనే ట్రంప్ భారత్-పాక్ మధ్య ఉన్న ఉద్రిక్తత పరిస్థితులను నిలిపివేయించాడు. అయినప్పటికీ తాజాగా పాకిస్తాన్ డ్రోన్లు భారత్ కి వస్తున్నట్టు ప్రకటించారు. ఒకవేళ భారత్ లోకి పాక్ డ్రోన్స్ వస్తే.. పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుందని పలువురు మేధావులు పేర్కొంటున్నారు.
ఇక మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ లు వారం రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025లోమిగిలిన 16 మ్యాచ్ ల కోసం బీసీసీఐ మూడు వేదికలను షార్ట్ లిస్ట్ చేయగా.. లిస్ట్ లో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఉన్నాయి. ఈ విషయాన్ని మాత్రం బీసీసీఐ అధికారికంగా వెల్లడించలేదు. మరో వారం రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఒకవేళ మ్యాచ్ లు మళ్లీ ప్రారంభమైతే.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లలో మిగిలిన మ్యాచ్ లను బీసీసీఐ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం.. హైదరాబాద్ లో క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్ లు జరగాల్సి ఉ:ది. లీగ్ మ్యాచ్ లతో పాటు ఫైనల్ కూడా హైదరాబాద్ లో జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో హైదరాబాద్ అభిమానులకు ఇది పండుగ అనే చెప్పాలి.
— Out Of Context Cricket (@GemsOfCricket) May 10, 2025