BigTV English

Ambati Rayudu : కోహ్లీ రిటైర్మెంట్ పై అంబటి రాయుడు ట్రోలింగ్.. వద్దు బాస్ అంటూ

Ambati Rayudu : కోహ్లీ రిటైర్మెంట్ పై అంబటి రాయుడు ట్రోలింగ్.. వద్దు బాస్ అంటూ

Ambati Rayudu :  భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ లకు రిటైర్మెంట్ తీసుకుంటాడని ఇవాళ ఉదయం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ కి గుడ్ బై చెప్పిన విషయం విధితమే. అతని బాటలోనే కోహ్లీ టెస్ట్ లకు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్టు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ నుంచి ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఆలోపు టెస్ట్ భవితవ్యం పై కోహ్లీ ప్రకటన చేస్తాడని సమాచారం. 


Also Read : Jay Shah – IPL: PSL 2025కు UAE నో పర్మిషన్….చక్రం తిప్పిన జై షా

తన రిటైర్ మెంట్ ఆలోచనను పరిగణలోకి తీసుకోవాలని బీసీసీఐకి కోహ్లీ చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఇప్పటికే రోహిత్, రవీంద్ర జడేజాతో కలిసి టీ-20లకు గుడ్ బై చెప్పిన విషయం విధితమే. మరోవైపు బీసీసీఐ అధికారి మాత్రం మరో రెండేళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడగల సత్తా కోహ్లీలో ఉంది అంటూ తెలిపాడు. అతని నిర్ణయాన్ని మార్చుకునేలా చర్చలు జరుపుతున్నట్టు వివరించాడు. ఇదిలా ఉంటే తాజాగా విరాట్  కోహ్లీ రిటైర్మెంట్ పై.. అంబటి రాయుడు స్పందించాడు. కోహ్లీని రిటైర్మెంట్ తీసుకోవద్దని కోరాడు.అయితే గతంలో అంబటి రాయుడు కూడా రిటైర్మెంట్ తీసుకునే సమయంలో చాలా ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఒకరోజు రిటైర్మెంట్ ప్రకటించి ఆ తర్వాత రిటైర్మెంట్ క్యాన్సల్ చేసుకున్నాడు అంబటి రాయుడు. అలాంటి అంబటి రాయుడు.. ఇప్పుడు విరాట్ కోహ్లీ ని రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాడు. విరాట్ రిటైర్ అవ్వొద్దు. భారత జట్టుకు మీ అవసరం ఉంది.


Also Read : IPL 2025 Update: ఐపీఎల్ 2025 కొత్త షెడ్యూల్ వచ్చేసింది.. ఈ 3 మూడు వేదికల్లోనే మ్యాచ్ లు

ఇంకా మీలో ఆడే సత్తా చాలా ఉంది. మీరు లేకపోతే టెస్ట్ క్రికెట్ ఇప్పుడు ఉన్నట్టు ఉండదు. దయచేసి రిటైర్డ్ అవ్వాలనే నిర్ణయం పై మరోసారి ఆలోచించండి అని రాయుడు కోహ్లీని కోరారు. దీంతో క్రికెట్ అభిమానులు అంబటి రాయుడును ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్నాడు. కోహ్లీ గతంలో బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం ఓపెనర్ గా ఆడుతున్నాడు. కెప్టెన్ గా వ్యవహరించడం లేదు. ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్ జట్టు టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇంకా ఈ ఐపీఎల్ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లను సౌత్ ఇండియాలో నిర్వహించాలని భావిస్తున్నారట. ముఖ్యంగా పాక్- భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ రద్దు అయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ని విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. కోహ్లీ రిటైర్మెంట్ పై ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరీ.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×