Pak Drone Attack: ఇండియా- దాయాది దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసింది. అయితే ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లోనే పాక్ తన వక్ర బుద్ధిని చాటుకుంది. జమ్ముకశ్మీర్ లో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి ఫిరంగులతో, డ్రోన్ లతో దాడులు చేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
వక్ర బుద్ధి పోనిచ్చుకోని పాకిస్థాన్..!
కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘించడంపై ఆగ్రహం
స్ట్రాంగ్ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టిన భారత్
పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని భారత్ నిర్ణయం
బార్డర్లో దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రభుత్వం#IndiaPakistanWar #IndianArmy… https://t.co/c3LHYVf0dW pic.twitter.com/WXNqj0Criw
— BIG TV Breaking News (@bigtvtelugu) May 10, 2025
జమ్ము కశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు దిగినట్టు తెలుస్తోంది. రాజోరి, ఆర్ఎస్ పుర, అక్నూర్ లో సాధారణ పౌరులే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతున్నట్టు సమాచారం. కశ్మీర్ లో పలు ప్రాంతాల్లో కాల్పులు శబ్దాలు వినిపించినట్టు సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంపై నిర్ణయం తీసుకున్న నాలుగు గంటలకే మళ్ళీ పాక్ దాడులకు దిగుతుండడం ఏంటి అని పలువురు సోషల్ మీడియా వేదికగా ఫైరవుతున్నారు.
కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘ఇది ఏమాత్రం కాల్పుల విరమణ ఒప్పందం కాదు. రాజోరి, ఆర్ఎస్ పుర, అక్నూర్, జమ్ము కశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి పేలుళ్ల శబ్ధాలు భారీగా వినిపించాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఎక్కడ పోయింది..? శ్రీనగర్ అంతటా పేలుళ్లు శబ్దాలు వినిపించాయి’ అని ఆయన ట్వీట్ చేశారు.
What the hell just happened to the ceasefire? Explosions heard across Srinagar!!!
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025
పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ నుంచి భారత్ ఆర్మీకి ఈరోజు మధ్యాహ్నం 3:35 గంటలకు కాల్ వచ్చిన విషయం తెలిసిందే. దాయాది పాకిస్థాన్ కోరిక మేరకే కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చెప్పినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ధృవీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విదేశాంగ కార్యదర్శి మిస్రి ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఈ సందర్బంగా కాల్పుల విరమణను రెండు దేశాలు అంగీకరించినట్టు కూడా ఆయన తెలిపారు.
Also Read: Imran Khan: పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ దారుణ హత్య..?
మీడియా సమావేశంలో మిస్రి మాట్టాడుతూ.. ‘సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. ఇరుదేశాల డీజీఎంవోల మధ్య చర్చలు జరిగాయి. ఈ రోజు మధ్యాహ్నం 3:35 గంటలకు పాక్ డీజీఎంవో నుంచి భారత్ డీజీఎంవోకు ఫోన్ కాల్ వచ్చింది. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలించినట్టు పాక్ మంత్రి ఇషాక్ దర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. ఈ నెల 12న ఇరు దేశాల మిలటరీ జనరల్ తదుపరి చర్చల గురించి మాట్లాడుకోనున్నారు’ అని ఆయన వెల్లడించారు. అయితే ఇంతలోనే పాకిస్థాన్ తన వక్ర బుద్ది చూపించకోవడం.. కశ్మీర్ లో కాల్పులకు పాల్పడడం ఏంటని భారతీయ పౌరులు రగిలిపోతున్నారు.
అయితే నిజంగా పాక్ కాల్పులకు పాల్పడిందా..? లేదా..? అనేది అధికార సమాచారం ద్వారా క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: KA Paul Viral Video: యుద్ధం ఆపేందుకు రాత్రిపగలు కష్టపడ్డాను.. కేఏ పాల్ వీడియో వైరల్