IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు ( IPL 2025 ) సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఈ టోర్నమెంట్ ఎప్పటినుంచి ప్రారంభమవుతుంది అనే దానిపై… అధికారిక ప్రకటన వెలువడింది. మార్చి 14వ తేదీ నుంచి… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ టోర్నమెంట్లో రాబోయే మూడు సీజన్లకు సంబంధించి.. షెడ్యూల్ రిలీజ్ చేశారు.
2025 ఐపీఎల్ మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమవుతే.. మే 25వ తేదీన ఫైనల్ జరుగుతుంది. దీని పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. అలాగే 2026 ipl టోర్నమెంట్ మార్చి 15 నుంచి మే 31 మధ్య జరుగనుంది. 2027 ఐపీఎల్ టోర్నమెంట్ మార్చి 14 నుంచి మే 30 వరకు నిర్వహించనున్నారు.