BigTV English

Fake IPS officer Katyal: 69 ఏళ్ల నకిలీ ఐపిఎస్ ఆఫీసర్.. అమిత్ షా సలహాదారుడిగా చలామణి.. ఎలా చేశాడంటే

Fake IPS officer Katyal: 69 ఏళ్ల నకిలీ ఐపిఎస్ ఆఫీసర్.. అమిత్ షా సలహాదారుడిగా చలామణి.. ఎలా చేశాడంటే

Fake IPS officer Katyal| బాగా చదువుకొని.. జీవితంలో మంచి ఉద్యోగం చేసి.. ప్రశాంతంగా రిటైర్మెంట్ జీవితాన్ని ఆనందించాల్సిన వయసులో ఓ వ్యక్తి మోసగాడి అవతారం ఎత్తాడు. ఎన్నో ప్రభుత్వ అధికారులను మోసం చేశాడు. భారీ మొత్తంలో డబ్బు దోచుకున్నాడు. ఇదేదో సినిమా కథ కాదు. నిజజీవితంలో జరిగిన ఘటన.


దేశ రాజధాని ఢిల్లీలోని మంచి ఖరీదైన ప్రాంతం గ్రేటర్ కైలాష్-1 లో నివసించే అనిత్ కత్యాల్ తనని తాను ఒక మాజీ ఐపిఎస్ ఆఫీసర్ గా చాలా సంవత్సరాలుగా చలామణి అవుతున్నాడు. మణిపూర్ కేడర్ 1979 బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్ అని, డైరెక్టర్ జెనెరల్ ఆఫ్ పోలీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్, ప్రస్తుతం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు సలహాదారుని చాలా కీలక పదవుల్లో పనిచేశానని, చేస్తున్నానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో తన నకిలి ఐడి కార్డులు చూపించి చాలా మంది జూనియర్ పోలీస్ ఆఫీసర్లకు ఆదేశాలిస్తూ.. తనకు కావాల్సిన పనులు చేయించుకునేవాడు. ఒక సందర్భంలో అయితే తాను ప్రస్తుత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ తో కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నానని నమ్మించేశాడు. ఇతని మోసాల బాగోతం ఢిల్లీ నుంచి దుబాయ్ వరకు సాగింది.

Also Read: బ్యాంకులో దొంగతనం చేసి పరార్.. దేశమంతా స్వామిజీగా జల్సా.. 20 ఏళ్ల తరువాత ఎలా చిక్కాడంటే..


అసలు అనిత్ కత్యాల్ ఎవరు?
అనిత్ కత్యాల్ నిజజీవితం గురించి చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే అతను సామాన్యుడు కాడు. బాగా చదువుకొని, సంపన్న కుటుంబానికి చెందినవాడు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో కెమిస్ట్రీ డిగ్రీ పూర్తి చేసి.. యుపిఎస్‌సి సివిల్ పరీక్షలు రాశాడు. కానీ ఫెయిల్ అయ్యాడు. ఆ తరువాత అమెరికాలోని యేల్ యునివర్సిటీలో పిహెచ్ డి పూర్తిచేశాడు. హిందుస్తాన్ లీవర్, యమహ, వొడాఫోన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశాడు. వొడాఫోన్ కంపెనీలో కార్పొరేట్ అఫెయిర్స్ వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉంటూ రిటైర్ అయ్యాడు.

మరి ఇంత మంచి జీవితం అనుభవించిన వ్యక్తి ఇలా మోసగాడిగా ఎందుకు మారాడని పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కత్యాల్ వయసు రీత్యా అతడిని కేవలం మాటలతోనే విచారణ చేస్తున్నామని పోలీసులు తెలపారు. కత్యాల్ బ్యాంక్ అకౌంట్ లో లావాదేవీల ద్వారా అతను ఎంతకాలంగా ఈ పనిచేస్తున్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఢిల్లీ, గురుగ్రామ్ లాంటి ప్రాంతాల్లోని సీనియర్ ప్రభుత్వ అధికారులను సైతం అనిల్ కత్యాల్ మోసగించాడని, ఇతర రాష్ట్రాల్లో కూడా కత్యాల్ బాధితులు ఉన్నారని వెల్లడైంది.

అనిత్ కత్యాల్ ముఖ్యంగా అవినీతి కేసులు ఎదుర్కొంటున్న పెద్ద పెద్ద బిజినెస్ మెన్‌లకు సాయం చేసేవాడు. వారిపై జరుగుతున్న కేసుల విచారణ మధ్యలో ఆపించేయడం, లేదా పక్కదారి మళ్లించడానికి ప్రయత్నించేవాడు. అందుకోసం వారి వద్ద నుంచి భారీగానే సొమ్ము రాబట్టేవాడు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో కత్యాల్ తో కలిసి చదువుకున్నవారు చాలామంది కీలక పదువుల్లో ఉండడంతో వారితో స్నేహం చేసి కీలక సమాచారం రాబట్టేవాడు. ఉదాహరణకు దుబాయ్ లో స్థిరపడ్డ భారత బిలియనీర్ వ్యాపారవేత్త బల్విందర్ సింగ్ సహ్ని అవినీతి కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. దీంతో అతడికి సాయం చేసేందుకు భారీగా డబ్బులు తీసుకొని విదేశాంగ మంత్రిత్వశాఖలో నకిలీ అధికారిగా వెళ్లాడు. తాను ప్రస్తుత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్నేహితుడినని.. కాలేజీలో ఆయనకు సీనియర్ నని అధికారులను నమ్మించాడు.

Also Read: లండన్ వీసా మాయలో మోసపోయిన మహిళ.. డబ్బులు దోచుకొని సామూహిక అత్యాచారం చేసిన ఏజెంట్లు

ఎలా పట్టుబడ్డాడంటే?
ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్ గాజియాబాద్ జిల్లా ఇందిరాపురం పోలీసులు అనిల్ కత్యాల్ స్నేహితుడు వినోద్ కపూర్ అరెస్ట్ చేశారు. వినోద్ కపూర్ ఒక బిల్డర్. ఒక పెద్ద నిర్మాణ కంపెనీకి ఓనర్. ఢిల్లీ ఎయిర్ పోర్ట్, గ్వాలియర్ ఎయిర్ బేస్ ప్రాజెక్టుల నిర్మాణం వినోద్ కపూర్ కంపెనీ చేసింది. అయితే గాజియాబాద్ పోలీసులు అతడిని ఒక ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేశారు. దీంతో వినోద్ కపూర్ ని ఆ కేసు నుంచి విడిపించడానికి అనిల్ కత్యాల్ రంగంలోకి దిగాడు. ఎప్పటిలాగానే తాను మణిపూర్ కేడర్ మాజీ ఐపిఎస్ ఆఫీసర్‌ నని చెప్పుకుని పోలీసులతో పరిచయం చేసుకున్నాడు. తాను ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సలహాదారుని పనిచేస్తున్నట్లు నమ్మించాడు. అది విని పోలీసులు అలర్ట్ అయిపోయారు. ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో పనిచేసే పోలీసులందరినీ భయపెట్టాడు. వినోద్ కపూర్ చాలా పరువుగల వ్యాపారవేత్త అని, అతనిపై తప్పుడు కేసులు బనాయించిన పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించేస్తానని బెదిరించాడు.

ఆ తరువాత గాజియాబాద్ రెండు రోజుల క్రితం గాజియాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీసుకి వెళ్లాడు. కమిషనర్‌ని కూడా నమ్మించేశాడు. కానీ చిన్న పొరపాటుతో పట్టుబడ్డాడు. కమిషనర్ తో తనకు ఫొటో కావాలని అడిగాడు. దీంతో కమిషనర్ కు అనుమానం వచ్చింది. అమిత్ షా సలహాదారుడు తనతో ఫొటో అడుగుతున్నాడేంటి? అని. వెంటనే ఆ పోలీస్ కమిషనర్.. అనిల్ కత్యాల్ ను ఒక గదిలో కూర్చోబెట్టి.. మణిపూర్ ఐపిఎస్ కేడర్ 1979 బ్యాచ్ లో అనిల్ కత్యాల్ గురించి ఆన్ లైన్ సెర్చ్ చేశాడు. అయితే ఆ ఐపిఎస్ అధికారుల జాబితాలో అనిల్ కత్యాల్ పేరు లేదు. దీంతో గాజియాబాద్ కమిషనర్.. అనిల్ కత్యాల్ ని అరెస్ట్ చేశారు.

అనిల్ కత్యాల్, అతని స్నేహితుడు బిల్డర్ వినోద్ కపూర్ పై చీటింగ్, ప్రభుత్వ అధికారులను డ్యూటీలో ఉండగా అడ్డుకోవడం, వారిని బెదిరించడం, ఆరోపణలు మోసి కేసు నమోదు చేశారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×