Big Stories

 ipl 2023 Final : ఐపీఎల్ ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఏంటి? వెదర్ కండీషన్ ఎలా ఉంది? ఒకవేళ వర్షం పడితే?

ipl 2023 Final

ipl 2023 Final : ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియం రెడీ అయింది. ఈ స్టేడియం కెపాసిటీ 60వేలు. ఇఫ్పటికే బుకింగ్స్ అన్నీ హౌస్ ఫుల్. ఆదివారం అభిమానులకు మజా అందించేందుకు రాత్రి ఏడున్నరకు రెండు జట్లు రెడీ అవుతున్నాయి. అంతా బాగానే ఉంది గానీ… ఒకవేళ వర్షం పడితే ఎలా? ఆల్రడీ సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్‌ను వరణుడు అడ్డుకున్నాడు. మరి ఆదివారం మ్యాచ్ సంగతేంటి? ఆ కంగారేం అక్కర్లేదంటోంది వెదర్ రిపోర్ట్. రేపు ఫుల్ ఎండ. మబ్బులు పట్టే అవకాశం లేదు.. సడెన్‌గా వర్షం పడే ఛాన్స్ అంతకంటే లేదు. పక్కాగా రెండు జట్లు 40 ఓవర్లు ఆడే వరకు చినుకు కూడా పడదన్నది వెదర్ రిపోర్ట్. ఆదివారం సాయంత్రం నరేంద్ర మోదీ స్టేడియం పరిసరాల్లో టెంపరేచర్ 29 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని అంచనా. పరిస్థితులు తల్లకిందులై ఒకవేళ వర్షం పడినా కంగారు పడనక్కర్లేదు. ఎలాగూ రిజర్వ్ డే ఉంది. అంటే మే 29 సోమవారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరుగుతుంది.

- Advertisement -

పిచ్ కూడా ఒక్క బ్యాటింగ్‌కో, ఒక్క బౌలింగ్‌లో అనుకూలించే పిచ్ కాదు. బాల్‌ను బాదాలనుకునే వారికి కావాల్సినంత పిచ్ సెట్ చేసి పెట్టారు. బౌలర్లకు కూడా మంచి బౌన్స్ దొరుకుతుందంటున్నారు. ఇక ఏ జట్టు ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడడమే మిగిలిందిక.

- Advertisement -

ఇక రెండు జట్ల ప్రాబబుల్స్ ఒకసారి చూస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ తరపున రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ ఆడతారు.

గుజరాత్ టైటాన్స్ తరపున వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా,  మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ ఆడే ఛాన్స్ ఉంది. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News