Big Stories

IPL : ఆఖరి బంతికి సిక్స్ కొట్టారు.. మ్యాచ్ గెలిచారు.. టాప్-3 మ్యాచెస్

- Advertisement -

- Advertisement -

IPL : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆఖరి బాల్ సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిచింది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్ జట్టు.. ఆఖరి బంతి వరకు పోరాడింది. లాస్ట్ బాల్ నోబాల్ పడడం కూడా కలిసొచ్చింది. ఫోర్ కొడితే చాలు మ్యాచ్ గెలుస్తుంది. కాని, సన్ రైజర్స్ ఆటగాడు సమద్ ఏకంగా సిక్స్ బాది హైదరాబాద్‌కు గొప్ప విజయాన్ని అందించాడు. ఇలా ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన సందర్భాలు ఐపీఎల్‌లో బోలెడు. వాటిలో టాప్-3 మ్యాచులు చూద్దాం.

1. కెఎస్ భరత్
మన వైజాగ్ కుర్రాడు లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన హీరో. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న కేఎస్ భరత్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 164 పరుగులు చేసింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు జట్టు… 2.1 ఓవర్లలోనే 6 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. వికెట్లు కోల్పోతూ ఆఖరి వరకు మ్యాచ్ నెట్టుకొచ్చింది బెంగళూరు. ఇక ఆఖరి ఓవర్‌కు 15 పరుగులు చేస్తేనే విజయం. మొదటి ఐదు బాల్స్‌ వేసి 9 పరుగులు ఇచ్చాడు ఢిల్లీ బౌలర్ ఆవేశ్ ఖాన్. ఇక ఆఖరి బంతికి సిక్స్ కొడితేనే ఈక్వేషన్ కుదురుతుంది. అద్భుతం జరిగింది. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి బెంగళూరును గెలిపించాడు.

2. ఎంఎస్ ధోని
ధోనీ గురించి చెప్పేదేముంది. ఆఖరి ఓవర్లో 30 పరుగులు చేయాల్సి ఉన్నా… ఫోర్లు, సిక్సులతో మ్యాచ్‌ను గెలిపిస్తాడు. ఇక ఆఖరి బాల్‌కు సిక్స్ కొట్టడం పెద్ద విశేషమేం కాదు. కాని, అలాంటి ఓ మ్యాచ్ గురించి చెప్పుకోవాలి. 2016 సీజన్‌లో పుణె సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు ఎంఎస్ ధోనీ. ఆ మ్యాచ్‌లో విజయానికి 173 పరుగులు కావాలి. 19 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది ధోనీ సేన. అంటే ఆఖరి ఓవర్‌కు చేయాల్సిన పరుగులు 23. అందులోనూ ఫస్ట్ బాల్ వేస్టే. 5 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన సమయంలో వరుసగా నాలుగు బాల్స్‌లో మూడు సిక్సులు, ఒక ఫోర్ బాదాడు ధోనీ. ఇక ఆఖరి బాల్‌కు 6 కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.

3. డ్వేన్ బ్రావో
అసలు టోటల్ ఐపీఎల్‌లోనే చివరి బంతికి 6 కొట్టి మ్యాచ్‌ను గెలిపించడం మొదలైందే డ్వేన్ బ్రావోతో. 2012 సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు లక్ష్యం 159 పరుగులు. 19 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది చెన్నై. ఫస్ట్ బాల్ సింగిల్ తీశాడు బ్రావో. రెండో బాల్‌కు ధోనీ ఔట్. నెక్ట్స్ మూడు బాల్స్‌కు బ్రావో, జడేజా మూడు పరుగులు చేశారు. ఆఖరి బాల్‌కు 5 పరుగులు కావాలి. అంటే 6 కొడితే తప్ప గెలవలేరు. అలాంటి సమయంలో చివరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు బ్రావో.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News