Big Stories

App Tracking: యాప్ ట్రాకింగ్ అంటే ఏమిటి..? దాని వల్ల జరిగే నష్టాలేమిటి..?

- Advertisement -

- Advertisement -

App Tracking: ఈరోజుల్లో ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్సే కనిపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్న వారందరికీ దానిపై పూర్తిగా అవగాహన ఉందా అంటే సమాధానం పూర్తిగా అవును అని చెప్పలేం అంటున్నారు నిపుణులు. అలా అవగాహన లేకుండా స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్న వారే సైబర్ క్రిమినల్స్ టార్గెట్ అని ఇప్పటికే చాలాసార్లు నిరూపణ అయ్యింది. తాజాగా స్మార్ట్ ఫోన్స్ అనేవి మనుషులను మరో విధంగా అయోమయంలో పడేస్తున్నాయని తేలింది.

మామూలుగా కొన్ని స్మార్ట్ ఫోన్స్ అనేవి ఎంత ప్రయత్నించినా హ్యాక్ అవ్వవు. కానీ అవగాహన లేకుండా దానిని ఉపయోగించడం వల్ల వారికి తెలియకుండానే వారి సమాచారాన్ని తమంతట తాముగా హ్యాకర్ల చేతిలో పెడుతున్నారు యూజర్లు. స్మార్ట్ ఫోన్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే కొన్ని యాప్స్ ముందుగానే ట్రాకింగ్ చేయాలా వద్దా అని అడుగుతాయి. అసలు ట్రాకింగ్ అంటే ఏంటో తెలియని వారు అది తమ స్మార్ట్ ఫోన్ పర్ఫార్మెన్స్‌ను ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుందని ఎస్ అని క్లిక్ చేస్తారు. అక్కడి నుండే అసలు సమస్య మొదలవుతుంది.

స్మార్ట్ ఫోన్స్‌ను హ్యాక్ చేయడానికి హ్యాకర్లు ఎక్కువగా ఉపయోగించే అస్త్రాలు ఈ యాప్స్. యాప్‌లోని డేటాను ఈజీగా సొంతం చేసుకోవడం వారి దగ్గర ఉంటే టెక్నిక్స్ ఎన్నో. స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్న వారిలో దాదాపు 43 మంది యాప్ ట్రాకింగ్ అనే కాన్సెప్ట్‌ను తప్పుగా అర్థం చేసుకుంటారని లేదా దీని వల్ల కన్‌ఫ్యూజ్ అవుతున్నారని తేలింది. యాప్ ట్రాకింగ్ అనేది పూర్తిగా హ్యాకింగ్‌కు సహాయపడకపోయినా.. కొన్ని యాప్స్ మాత్రం యూజర్లకు ఎలాంటి యాడ్స్ చూపిస్తే మేలు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం దీనిని ఉపయోగిస్తారు.

యాప్ ట్రాకింగ్ అనేది యాపిల్ ఫోన్స్‌లో ఒకలాగా, ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో మరొకలాగా ఆపరేట్ అవుతుంది. యాపిల్ ఫోన్‌లో ఒక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోగానే ‘ఆస్క్ యాప్ నాట్ టు ట్రాక్’ లేదా ‘అలో’ అనే రెండు ఆప్షన్స్‌ను చూపిస్తుంది. ఆండ్రాయిడ్‌లో మాత్రం దీనిని ప్రత్యేకంగా ఫోన్ సెట్టింగ్స్‌లో వెళ్లి మార్చుకోవాల్సి ఉంటుంది. ట్రాకింగ్ అనేది వద్దు అని క్లిక్ చేసిన తర్వాత ఆ యాప్ అనేది యూజర్లకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకోవడం కష్టమయిపోతుంది.

కొందరు పరిశోధకులు అసలు యాప్ ట్రాకింగ్‌ను ఎందుకు అనుమతిస్తున్నారో తెలుసుకోవడం కోసం 312 మందితో ఒక సర్వేను నిర్వహించారు. వారంతా యాప్ మెరుగ్గా పనిచేస్తుంది అన్న ఉద్దేశ్యంతో ఆ ఆప్షన్‌ను ఎంచుకున్నట్టు చెప్తున్నారు. అయితే యాప్ ట్రాకింగ్ వల్ల పెద్దగా నష్టం అనేది జరగకపోయినా.. దీనిపై అవగాహన ఉండడం ఎందుకైనా మంచిది అని నిపుణులు సలహా ఇస్తున్నారు. యాప్ ట్రాకింగ్ రిజెక్ట్ అవ్వడం వల్ల యాప్స్‌కు యాడ్స్‌ను అందించే అవకాశం పోయి రెవెన్యూను కోల్పోతుందని వారు బయటపెట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News