E-Paper

Irfan Pathan: ఎయిర్ బేస్ ల లాగానే పాకిస్తాన్‌ వికెట్లు కూప్ప‌కూలాయి

Irfan Pathan: ఎయిర్ బేస్ ల లాగానే పాకిస్తాన్‌ వికెట్లు కూప్ప‌కూలాయి
Advertisement

Irfan Pathan:  టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 Tournament) నేపథ్యంలో ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India Women vs Pakistan Women) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా అద్భుతంగా రాణించిన టీమిండియా 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆదివారం పాకిస్తాన్ జట్టుకు కాళ‌రాత్రి మిగిలింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం పై తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండ‌ర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan ) తన స్టైల్ లో స్పందించారు. పాకిస్తాన్ ఎయిర్ బేస్ లు (Air Bases) ధ్వంసం అయినట్లుగానే పాకిస్తాన్ మహిళా క్రికెటర్ల వికెట్లు కుప్పకూలాయని బాంబు పేల్చారు. టీమిండియా మహిళల బౌలింగ్ దెబ్బకు పాకిస్తాన్ క్రికెటర్లు విలవిలలాడిపోయారని చురకలు అంటించారు. ఇక జన్మలో ఇండియాతో పాకిస్తాన్ మహిళలు ఆడడం కష్టమేనంటూ సెటైర్లు పేల్చారు ఇర్ఫాన్ పఠాన్.

Also Read: Women’s T20 World Cup 2026 ENG VS SL: 23 రోజుల కింద తల్లి అయింది..ఇప్పుడు సెంచ‌రీతో ఇర‌గ‌దీసిన లెస్బియ‌న్ క్రికెట‌ర్

ఎయిర్ బేస్ ల లాగానే పాకిస్తాన్‌ వికెట్లు కూప్ప‌కూలాయి

Advertisement

టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 170 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో చేతులెత్తేసింది పాకిస్తాన్. 17 ఓవర్లు ఆడిన పాకిస్తాన్, 106 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు విభాగాల్లో అదరగొట్టిన టీమిండియా… పాకిస్తాన్ జట్టుకు ఆదివారం కాలరాత్రి మిగిల్చింది. ముఖ్యంగా దీప్తి శర్మ నాలుగు ఓవర్లు వేసి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టింది. అటు ఆంధ్ర బిడ్డ శ్రీ చరణి మూడు వికెట్లు పడగొట్టగా… లేడీ వీరేంద్ర సెహ్వాగ్ షెఫాలీ వర్మ ఒక వికెట్ తీశారు.

అయితే బౌలింగ్ లో అదరగొట్టిన టీమిండియా పై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించారు. టి20 వరల్డ్ కప్ లో ఉండాల్సిన బౌలింగ్ లక్షణాలన్నీ టీం ఇండియాలో ఉన్నాయని వెల్లడించారు. ఆరంభంలోనే అదరగొట్టారని ప్రశంసించారు. ఇదే దూకుడుతో ముందుకు వెళితే టీమిండియా వరల్డ్ కప్ గెలవడం గ్యారెంటీ అన్నారు. పాకిస్తాన్ పైన దీప్తి శర్మ వేసిన బౌలింగ్ అదరహో అంటూ ప్రశంసించారు. ఆమె దెబ్బకు ఎయిర్ బేస్ లు కుప్పకూలినట్లుగానే.. పాకిస్తాన్ వికెట్లు కుప్పకూలినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇర్ఫాన్ పఠాన్. అయితే టీమిండియా ప్రదర్శన పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీతో బీసీసీఐ కుమ్మక్కై.. పాకిస్తాన్ జట్టును దారుణంగా ఓడించిందని పేర్కొంటున్నారు. తన్వీర్ అహ్మద్, షాహిద్ అఫ్రిదిలు కాస్త ఓవర్ గా రియాక్ట్ అవుతూ రెచ్చిపోతున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక బురద జల్లుతున్నారు.

Advertisement

Also Read: Muhammad Furqan Bhatti ON Vaibhav Sooryavanshi: అలీ ర‌జా బౌలింగ్ లో వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

 

Related News

పాక్ ప్లేయ‌ర్ల‌పై దీప్తి శర్మ మర్డర్ అటెమ్ట్ ? జేబులో స్ప్రే బాటిల్ పెట్టుకుని ప్లాన్

Shahid Afridi: స్మృతి, రీచా ఘోష్ బ్యాట్ల‌ల్లో చిప్స్..అందుకే పాక్ ఓడిపోయింది

ఒక్క మ్యాచ్ కే సంబ‌రాలు చేసుకోకండి..ఫైన‌ల్స్ లో టీమిండియాను ఓడిస్తాం

Cooper Gifts Bike to Litton Das: కూపర్ గొప్ప మ‌న‌సు..లిట‌న్ దాస్ కు బైక్ గిఫ్ట్

Ashwin: పాకిస్తాన్ పై గెలిచినా, వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి టీమిండియా ఎలిమినేట్ అవుతుంది !

మీ ఆట చూస్తే విర‌క్తి పుడుతోంది…కామెంట్రీ ప్యానెల్ లో కూర్చోలేక‌పోతున్నాం

టీమిండియాలో అంద‌రూ మ‌గాళ్లే…ఛీటింగ్ చేసి, పాకిస్తాన్ ను ఓడించారు

×