E-Paper

7 ఏళ్ల నాటి ఫ్లాప్ సినిమా ట్రెండింగ్లో… ఇంకా చూడలేదా ?

7 ఏళ్ల నాటి ఫ్లాప్ సినిమా ట్రెండింగ్లో… ఇంకా చూడలేదా ?
Advertisement

Bollywood Trening Movie : ఎప్పటిలాగే ఈ వారం కూడా నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో టాప్ 10 ట్రెండింగ్ జాబితా ఆసక్తికరంగా మారింది. కొత్తగా విడుదలైన సినిమాలు, సిరీస్ లు టాప్ స్థానాలను ఆక్రమించగా, పాత సినిమాలు కూడా తమ మ్యాజిక్ చూపిస్తున్నాయి. అలాంటి ఒక సినిమా 2019లో థియేటర్లలో విడుదలై, అంచనాలు అందుకోలేక నిరాశ కలిగించినా, ఇప్పుడు OTTలో మాత్రం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆ మూవీ పేరే ‘కలంక్’.

ప్లాప్ సినిమా ట్రెండింగ్ లో

ఫ్లాప్ నుంచి కల్ట్ హిట్ వరకు ‘కలంక్’ సినిమా ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. ప్రముఖ దర్శకుడు అభిషేక్ వర్మన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో టాప్ 10లో 6వ స్థానంలో ట్రెండ్ అవుతోంది ఈ మూవీ. వరుణ్ ధావన్, అలియా భట్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్, మాధురీ దీక్షిత్, కునాల్ ఖేము వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రం 2019లో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. కానీ టీవీ, ఓటీటీ వేదికలపై కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది. కరణ్ జోహార్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా భారీ బడ్జెట్‌ తో తెరకెక్కినా, థియేటర్లలో ఆశించిన సక్సెస్ సాధించలేదు. అయితే ఓటీటీలో చూసేవారికి ఇది ఒక విజువల్ ట్రీట్‌గా మారింది.

కథలోకి వెళ్తే…

Advertisement

ఈ చిత్రం 1945లో భారత విభజనకు ముందు కాలంలో సెట్ సాగుతుంది. ఉత్తర భారతదేశంలోని హుస్నాబాద్ అనే ఊరిలో జరిగే కథలో ఒక ధనిక వ్యాపారి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. రూప్ చౌదరి (అలియా భట్) ఇండిపెండెంట్ గా ఉండే విద్యావంతురాలు. ఆమె ఒక రోగగ్రస్తురాలైన సత్య (సోనాక్షి సిన్హా) అనే ఆవిడ భర్త దేవ్ చౌదరి (ఆదిత్య రాయ్ కపూర్)కు రెండో భార్యగా వస్తుంది. ఈ నేపథ్యంలో రూప్‌కు జఫర్ (వరుణ్ ధావన్) అనే బ్లాక్ స్మిత్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య ఏర్పడిన ఆకర్షణ ప్రేమగా మారుతుంది. వేర్వేరు సామాజిక, మతపరమైన నేపథ్యాలు, కుటుంబ బంధాలు, విభజన సమయంలోని హింసాత్మక ఘటనలు వారి ప్రేమపై ఎఫెక్ట్ చూపిస్తాయి.

సంజయ్ దత్ (బలరాజ్ చౌదరి), మాధురీ దీక్షిత్ (బహార్ బేగం) వంటి సీనియర్ నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటించి సినిమాకు బలం చేకూర్చారు. భారీ సెట్స్, అద్భుతమైన కాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీతో విజువల్ ట్రీట్‌గా నిలిచింది ఈ మూవీ. ప్రీతమ్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. “ఘర్ మోరే పర్దేసియా”, “కలంక్ టైటిల్ ట్రాక్”, “ఫస్ట్ క్లాస్”, “తబాహ్ హో గయే” వంటి పాటలు ఇప్పటికీ హిట్‌గా వినిపిస్తాయి. థియేటర్లలో రూ. 150 కోట్లకు పైగా బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం సుమారు రూ.146 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ అయింది. కానీ ఓటీటీలోకి వచ్చాక విజువల్ ఎఫెక్ట్స్, పాటలు, పెద్ద స్క్రీన్ కాకుండా ఇంటి వాతావరణంలో చూసేవారికి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి.

ఎందుకు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ?

Advertisement

నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా కొత్త తరం ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తోంది. పీరియడ్ డ్రామా, రొమాన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్, బలమైన ఎన్సెంబుల్ కాస్ట్, మంత్రముగ్ధులను చేసే సంగీతం కారణంగా ఇది మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Read Also : డెడ్లీ మార్షల్ ఆర్ట్స్… దుమ్మురేపే యాక్షన్ సీన్స్… ఈ మాస్టర్ పీస్ ను డోంట్ మిస్

Tags

Related News

పదేళ్లుగా ఒకే అద్దె కొంపలో… కట్ చేస్తే కన్నీళ్లు పెట్టించే ట్విస్ట్

ఇదెక్కడి విడ్డూరం… నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో 8 ఏళ్ళ క్రితం విడుదలైన పాత వెబ్ సిరీస్

థ్రిల్లర్ నుంచి యాక్షన్ వరకు… ప్రైమ్ వీడియోలోకి వచ్చిన కొత్త సినిమాలు

‘ఇక్కా’ ఓటీటీ విడుదలకు లైన్ క్లియర్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

జూన్ 15 నుండి 21 వరకు… ఈ వీకెండ్ రిలీజ్ కానున్న సస్పెన్స్-కామెడీ సినిమాలు, సిరీస్ లు

‘రాజా శివాజీ’ నుండి ‘సైరత్’ వరకు… ఈ క్రేజీ మరాఠీ మూవీస్ ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

పోలీస్ స్టేషన్లో లేడీ ఆఫీసర్ ను ఓ ఆట ఆడుకునే దెయ్యాలు… ఒళ్లు గగుర్పొడిచే క్లైమాక్స్

×