E-Paper
Advertisement

T20 world cup Hat-trick : హ్యాట్రిక్.. వరల్డ్ రికార్డ్.. ఐరిష్ బౌలర్ సెన్సేషన్..

T20 world cup Hat-trick : హ్యాట్రిక్.. వరల్డ్ రికార్డ్.. ఐరిష్ బౌలర్ సెన్సేషన్..
Advertisement

T20 world cup Hat-trick : T20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పై హ్యాట్రిక్ సాధించిన ఐరిష్ బౌలర్ జోస్ లిటిల్… సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ T20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అరుదైన ఫీట్ సాధించాడు. కవీస్ తో మ్యాచ్ ముందు వరకు… ఒక ఏడాదిలో T20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న జోస్ లిటిల్… హ్యాట్రిక్ తో ఒక్కసారిగా ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేశాడు.

కివీస్ తో జరిగిన మ్యాచ్ లో 19వ ఓవర్ వేసిన లిటిల్… వరుసగా రెండు, మూడు, నాలుగు బంతులకు… కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ సాంట్నర్‌ వికెట్లు తీశాడు. దాంతో… ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధికంగా 39 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డులకెక్కాడు… లిటిల్. ఒక క్యాలెండర్ ఇయర్ లో T20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఇప్పటిదాకా నేపాల్ కు చెందిన సందీప్ పేరిట ఉండేది. సందీప్ ఈ ఏడాదే అందుకున్న ఆ రికార్డును… లిటిల్ తన పేరిట మార్చుకున్నాడు.

Advertisement

ఈ ఏడాది లిటిల్ తర్వాత అత్యధికంగా వికెట్లు పడగొట్టి వారి జాబితాలో నేపాల్ బౌలర్ సందీప్, భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. భువీ ఈ ఏడాది T20ల్లో 37 వికెట్లు తీసుకున్నాడు. ఇక గత ఏడాది టీ20ల్లో… శ్రీలంక బౌలర్ వనిందు హసరంగ, సౌతాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంసి… ఒక్కొక్కరు 36 వికెట్లు తీశారు. నిరుటి వరకు ఇదే రికార్డ్. ఈ ఏడాది భువీ, నేపాల్ బౌలర్ సందీప్ పాత రికార్డుల్ని తుడిచిపెట్టేస్తే… ఇప్పుడు ఐరిష్ బౌలర్ లిటిల్ ఆ రికార్డును తన పేర మార్చుకున్నాడు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×