Big Stories

Australia : ఆసీస్ కు అదృష్టమా? అవమానమా?

Australia : T20 వరల్డ్ కప్ సూపర్-12లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా అన్ని మ్యాచ్ లు ఆడేసింది. ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దు, మూడు విజయాలతో 7 పాయింట్లు సాధించి… గ్రూప్-1లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. అయితే, ఆస్ట్రేలియా సెమీస్ చేరాలంటే… ఇంగ్లండ్ పై శ్రీలంక గెలవాలి. అప్పుడు ఇంగ్లండ్ 7 పాయింట్లకే పరిమితమవుతుంది. శ్రీలంక కూడా 6 పాయింట్లతో ఇంటిదారి పట్టి… కివీస్ తో పాటు ఇంగ్లండ్ కన్నా మెరుగైన రన్ రేట్ తో ఆసీస్ సెమీస్ చేరుతుంది. దాంతో… ఇప్పుడు ఆసీస్ క్రికెటర్లు, ఆ దేశ అభిమానులు ఇంగ్లండ్ పై శ్రీలంక గెలవాలని గట్టిగా కోరుకుంటున్నారు. మరి వాళ్లు కోరుకుంటున్నట్లు శ్రీలంక గెలుస్తుందా? ఆస్ట్రేలియా సెమీస్ చేరి పరువు నిలబెట్టుకుంటుందా? లేక పరాభవాన్ని ఎదుర్కొంటుందా? అనేది… పూర్తిగా ఆ జట్టు అదృష్టంపై ఆధారపడి ఉంది.

- Advertisement -

వరుసగా గత 27 ఇన్నింగ్స్ ల్లో విఫలమైన ఆసీస్ బ్యాటర్ మ్యాక్స్ వెల్… ఆప్ఘన్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చాడు. ఆప్ఘనిస్తాన్ పై కష్టపడి గెలిచామని… తమ కోసమైనా ఇంగ్లండ్ పై శ్రీలంక గెలుస్తుందని ఆశిస్తున్నామని మ్యాక్స్‌వెల్ సరదాగా వ్యాఖ్యానించాడు. తమ కోసం శ్రీలంక తప్పకుండా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తుందనే నమ్మకం ఉందన్నాడు… మ్యాక్స్ వెల్. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అయితే… ఆస్ట్రేలియా సెమీస్ కే కాదు… ఏకంగా ఫైనల్ కు చేరుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఫైనల్ మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరుగుతుందని జోస్యం చెప్పాడు. తాను ఫైనల్ మ్యాచ్ చూసేందుకు మెల్ బోర్న్ కూడా వెళ్తున్నాని చెప్పాడు… రికీ పాంటింగ్. మరి ఇంగ్లండ్-శ్రీలంక మధ్య మ్యాచ్ ఎలా జరుగుతుందో… గ్రూప్-1 నుంచి సెమీస్ చేరే జట్టేదో తెలియాలంటే… మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News