BigTV English

Jason Gillespie: పాకిస్తాన్ జట్టును నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతా.. హెడ్ కోచ్ జేసన్ గిల్లెస్పీ

Jason Gillespie: పాకిస్తాన్ జట్టును నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతా.. హెడ్ కోచ్ జేసన్ గిల్లెస్పీ

Pakistan head coach Jason Gillespie: పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జేసన్ గిల్లెస్పీ నియమితులయ్యారు. ఈ మేరకు కరాచీలో ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం లహోర్‌లోని హైఫెర్మామెన్స్ సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడాడు. పాకిస్తాన్‌లో అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారని కితాబిచ్చాడు.


పాకిస్తాన్ క్రికెటర్లకు టాలెంట్‌కు కొదవలేదని గిల్లెస్పీ వ్యాఖ్యలు చేశాడు. అయితే నిలకడలేమి ప్రధాన సమస్య ఉందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ టీంలో నిలకడ తీసుకురావడమే తన లక్ష్యమని గిల్లెస్పీ తెలిపాడు. టీంలో స్థిరత్వం లేకపోవడంతోనే పాకిస్తాన్ చాలా టోర్నీల్లో విఫలమైందని చెప్పాడు.

ప్రస్తుతం పాకిస్తాన్ టీం..ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఐదో స్థానంలో ఉంది. రానున్న రెండు సిరీస్‌లు విజయం సాధించి మెరుగైన ర్యాంకు సాధిస్తామని వెల్లడించాడు.


Also Read: కుర్రాడికి తత్వం బోధపడినట్టుంది.. ఇషాన్ పై నెట్టింట సెటైర్లు

పాకిస్తాన్‌ను రెడ్ బాల్ క్రికెట్‌లో నంబర్ వన్ జట్టుగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేస్తానని వెల్లడించాడు. ఆగస్టులో పాకిస్తాన్ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్ తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ టెస్ట్ సిరీస్‌తోనే గిల్లెస్పీ భవితవ్యం తేలనుంది. ఈ టెస్ట్ సిరీస్ తర్వాత పాక్..స్వదేశంలోనే ఇంగ్లండ్‌తోనూ టెస్ట్ సిరీస్ ఆడనుంది.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×