E-Paper
Advertisement

ఔలింగ్ నీ వ‌ల్ల కాదులే, రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో..బుమ్రాపై సెహ్వాగ్ సీరియ‌స్ !

ఔలింగ్ నీ వ‌ల్ల కాదులే, రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో..బుమ్రాపై సెహ్వాగ్ సీరియ‌స్ !
Advertisement

Virender Sehwag On Bumrah: 2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి లాంటి కీలక ప్లేయర్లు జట్టుకు దూరం కాగా… తాజాగా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా గాయపడ్డాడు. ఆగస్టు 15వ తేదీ నుంచి శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం జస్‌ప్రీత్ బుమ్రాను సెలెక్ట్ చేశారు. ఇందులో భాగంగానే జులై 31వ తేదీన ఫిట్నెస్ టెస్ట్ కూడా పాస్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇంతలోనే మళ్లీ జస్‌ప్రీత్ బుమ్రాకు ( Jasprit Bumrah) గాయం తిరగబడిందని చెబుతున్నారు. అయితే వరుసగా గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (VIRENDER SEHWAG) సంచలన వ్యాఖ్యలు చేశారు. గాయాల బారిన ప్రతిసారి పడడం కంటే టెస్టులకు జస్‌ప్రీత్ బుమ్రా రిటైర్మెంట్ ప్రకటిస్తే బెటర్ అని సూచనలు చేశారు. కేవలం వ‌న్డే ఫార్మాట్ లో మాత్రమే జస్‌ప్రీత్ బుమ్రా ఆడితే మంచి ఫలితాలు ఉంటాయని వెల్లడించారు. మూడు ఫార్మాట్స్‌ ఆడడం వల్ల గాయాలు తరచూ అవుతాయని స్పష్టం చేశారు.

Also Read: Asia Cup 2025 trophy – Mohsin Naqvi: ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

ఔలింగ్ నీ వ‌ల్ల కాదులే, రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు వీరేంద్ర సెహ్వాగ్ కీలక సూచనలు చేశారు. ప్రతిసారి గాయాల బారిన పడడం కంటే… టీ20లతో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే బెటర్ అన్నారు. కేవలం వన్డేల్లో మాత్రమే జస్‌ప్రీత్ బుమ్రా ఆడితే.. గాయాల సమస్య తప్పుతుందని వెల్లడించారు. 2027 వన్డే వరల్డ్ కప్ వస్తుంద నేపథ్యంలో ఇప్పటి నుంచి వన్డేలపై జస్‌ప్రీత్ బుమ్రాను దృష్టి పెడితే, మంచి ఫలితాలు రావడం గ్యారెంటీ అని తెలిపారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో జస్‌ప్రీత్ బుమ్రా ఉంటేనే టీమిండియా గెలుస్తుందని కూడా గుర్తు చేశారు. ఇప్పటికైనా టీమిండియా కోసం టెస్టులు వదిలేయాలని కోరారు. జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన బౌలర్ అని, అత‌డు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఉంటే, టీమిండియా సగం మ్యాచ్ లు గెలిచిన‌ట్టేన‌ని వివ‌రించారు. బీసీసీఐ కూడా జస్‌ప్రీత్ బుమ్రాను వ‌న్డేల్లో మాత్రమే ఎక్కువ‌గా ఆడించాల‌ని కోరారు.

అసలు బుమ్రాకు గాయం ఎలా అయింది?

శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య ఆగస్టు 15వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రాను కూడా సెలెక్ట్ చేశారు. ఇందులో భాగంగానే జులై 31వ తేదీన ఫిట్నెస్ పరీక్షను కూడా ఎదుర్కొన్నాడు. ఇందులో జస్‌ప్రీత్ బుమ్రా పాస్ అయినట్లు వార్తలు రాగా, చివరి క్షణంలో అత‌నికి గాయమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. అతని ఎడమ మోకాలి గాయం తిరగబడిందట. అందుకే జస్‌ప్రీత్ బుమ్రాను టెస్ట్ సిరీస్ నుంచి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో ఆకీబ్ నబీ బరిలోకి దిగుతాడన్న వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisement

Also Read: Tamim Iqbal Urged Bangladesh Government: టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

 

Related News

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

మిస్ట‌ర్ న‌ఖ్వీ ఆ పొగ‌రంతా ప‌క్క‌కు పెట్టు..వెంట‌నే యూనిస్ ఖాన్ కు ప‌గ్గాలు ఇవ్వు

వహాబ్ రియాజ్ వాడి వ‌ల్ల కాదు, మ‌హిళ‌ల జ‌ట్టును నాకు అప్ప‌గించండి !

Fact Check: బ‌రితెగించిన స‌చిన్ కూతురు సారా టెండూల్క‌ర్..పొట్టి బ‌ట్ట‌లు వేసుకుని మ‌రీ !

అంపైర్ల‌ను కొనుగోలు చేసి, పాకిస్తాన్ ను ఓడించారు..త‌న్వీర్ ఆరోప‌ణ‌లు!

రాంచీలో చిల్ అవుతోన్న ధోని, రిష‌బ్ పంత్..కారులో షికార్లు కొడుతూ

ధోని చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…47 ఏళ్ల‌ ఇమ్రాన్ తాహిర్‌ ను చూసి నేర్చుకో ?

Big Stories

Advertisement
×