BigTV English

Sanjana Ganesan: సైన్స్ పాఠాల నుంచి ఏం నేర్చుకున్నారు..? నెటిజన్లకు బుమ్రా భార్య సంజనా ఘాటు ప్రశ్న!

Sanjana Ganesan: సైన్స్ పాఠాల నుంచి ఏం నేర్చుకున్నారు..? నెటిజన్లకు బుమ్రా భార్య సంజనా ఘాటు ప్రశ్న!
Jasprit Bumrah Wife Sanjana Ganesan tweet

Jasprit Bumrah Wife Sanjana Ganesan tweet: సంజనా గణేశన్, ప్రముఖ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా భార్య. తను ఒకప్పుడు స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ గా ఉండేది. అంతేకాదు ఆమె ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో డిజిటల్ ప్రెజెంటర్ గా పనిచేసింది. అలాగే ఆమె టీవీ కెరీర్ ప్రారంభించిన తర్వాత స్టార్ స్పోర్ట్స్‌తో కలిసి అనేక క్రికెట్ ప్రపంచ కప్‌లను కవర్ చేసింది. అన్నింటికి మించి 2014లో సంజనా మిస్ ఇండియా 2014లో ఫైనలిస్ట్ గా కూడా నిలిచింది.


ఇంతకీ విషయం ఏమిటంటే తను నెట్టింట ట్రోలింగ్ కి గురైంది. అదేమిటంటే ఇటీవల తను ఒక బాబుకి జన్మనిచ్చింది. ఆ క్రమంలో కొద్దిగా లావు అయ్యింది. ఆడవాళ్లు ప్రెగ్నెన్సీ తర్వాత లావు కావడం సహజంగా అక్కడక్కడ జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రమోషనల్ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ పక్కనే సంజన కూడా వచ్చింది. అయితే అందులో తను లావుగా కనిపించడంతో నెటిజన్లు తనని ఇబ్బంది పెట్టేలా, తనని ట్రోల్ చేస్తూ కామెంట్లు పెట్టారు. వదినా, కొద్దిగా లావు తగ్గించు…అంటూ ఈ తరహాలో పోస్టింగులు పెట్టారు.

దీంతో సంజన హర్ట్ అయ్యింది. కాకపోతే వారికి ఘాటుగా సమాధానం ఇచ్చింది. మీరు చదువుకున్న సైన్స్ పాఠాలు ఇవేనా? పాఠశాలల్లో నేర్పిన వాటి నుంచి కూడా నేర్చుకోలేని స్థితిలో ఉన్నారా? అంటూ సీరియస్ గా బదులిచ్చింది. అయితే తనకి సపోర్టుగా కొందరు స్పందించారు. గర్భదారణ సమయంలో కొవ్వు సహజంగా పేరుకుంటుంది. అది తర్వాత పోతుందని తెలిపారు. ప్రక్రతి సిద్ధంగా జరిగేవాటిపై ఇలా నెట్టింట ఒక డిబేట్ లా డిస్కర్షన్ జరగడంతో సంజనా ఎమోషనల్ అయ్యింది.


ఇది కరెక్ట్ కాదని పలువురు పేర్కొంటున్నారు. నెట్టింట ఒక క్రూరమైన ప్రపంచం ఉందని, వారెప్పుడు సెలబ్రిటీలు, క్రికెటర్లనే టార్గెట్ చేసుకుంటారని అంటున్నారు. అది కూడా ఒక క్రికెటర్ ఆరోజు మ్యాచ్ లో అద్భుతాలు చేస్తే, అతని మీద నెగిటివ్ గా దాడికి దిగుతారని, అప్పుడే తమ కామెంట్లు, వీడియోలు వైరల్ అవుతాయని విమర్శిస్తున్నారు. 

కేవలం తమ పేరుకోసం ఎదుటివారి జీవితాలతో ఆటలాడుకోవడం నేటి సమాజంలో ఎక్కువైందని ఘాటుగానే స్పందిస్తున్నారు. ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను రోడ్డుపైకి లాగేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

క్రికెటర్ల భార్యలలో సంజనా ఒక్కరే కాదు, పలువురు ట్రోలింగ్ బారిన పడినవారిలో ఉన్నారు. వారిలో ముఖ్యంగా విరాట్ కొహ్లీ భార్య అనుష్క శర్మ, ఇంకా రోహిత్ శర్మ భార్య రితికా తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ధోనీ భార్య సాక్షి కూడా నెట్ బాధితురాలిగా మారిపోయింది.

Related News

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Big Stories

×