BigTV English

Kane Williamson : కేన్ మామ దూకుడు.. 2 ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు..!

Kane Williamson : కేన్ మామ దూకుడు.. 2 ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు..!
Kane Williamson Records

Kane Williamson Records : కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ( కేన్ మామ) దూకుడు మామూలుగా లేదు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు చేసి రికార్డ్ సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేసిన కేన్ మామ రెండో ఇన్నింగ్స్‌లో 109 పరుగులు చేసి ఔరా అనిపించాడు. సీనియర్ క్రికెటర్లకు సవాల్ విసిరాడు.


సెంచరీల మోత మోగిస్తున్న విలియమ్సన్ తన టెస్టు కెరీర్‌లో 31వ సెంచరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. 170 టెస్ట్ ఇన్నింగ్స్ లో వేగంగా సెంచరీలు సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు.  సచిన్ టెండూల్కర్ అయితే 165 ఇన్నింగ్స్‌ల్లో 31 సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా 170 ఇన్నింగ్స్‌ల్లో 31 సెంచరీలు అందుకున్నాడు.

ఇవి కాకుండా కేన్ విలియమ్సన్ మరో రికార్డు నమోదు చేశాడు. న్యూజిలాండ్ తరఫున టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించిన అయిదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.


33 ఏళ్ల విలియమ్సన్ ఇటీవల బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు.  టెస్టుల్లో గత పది ఇన్నింగ్స్‌ల్లో అయిదు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ చేశాడు. ఈ  సెంచరీలతో ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆరో ప్లేయర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లి (80 సెంచరీలు), డేవిడ్ వార్నర్ (49), జో రూట్ (46), రోహిత్ శర్మ (46), స్టీవ్ స్మిత్ (44) తర్వాత విలియమ్సన్ (44 ) ఉన్నాడు.

కేన్ విలియమ్సన్ ను భారతదేశంలో క్రికెట్ అభిమానులు అందరూ కేన్ మామ అని ముద్దుగా పిలుచుకుంటారు. తను కూడా నెమ్మదస్తుడు, హావభావాలను బయటకి వ్యక్తం చేయకుండా ఆటలో ఎప్పుడూ మహేంద్ర సింగ్ ధోనీలా కూల్ గా ఉంటాడు. ఇప్పుడు విలియమ్సన్ ఫామ్ చూస్తుంటే, చాలా రికార్డులు బద్దలు కావడం ఖాయమని క్రీడా విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు.

మూడో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 179/4తో నిలిచింది. ప్రస్తుతం సౌతాఫ్రికాపై 528 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 511 పరుగులు చేయగా, సౌతాఫ్రికా 162 పరుగులకే ఆలౌటైంది. 528 పరుగుల ఆధిక్యంలో ఉంది. బహుశా నాలుగోరోజు మరికొన్ని పరుగులు చేసి డిక్లేర్ చేస్తుందని అంటున్నారు. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో రచిన్ రవీంద్ర 240 పరుగులు చేయడం విశేషం.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×