BigTV English

Kapil Dev: బీసీసీఐ నిర్ణయాన్ని అభినందిస్తున్నా.. కపిల్ దేవ్..!

Kapil Dev: బీసీసీఐ నిర్ణయాన్ని అభినందిస్తున్నా.. కపిల్ దేవ్..!


Kapil Dev Appreciates BCCI’s Decision: ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ క్రికెటర్ ఇండియాకి మొట్టమొదటి వరల్డ్ కప్ తీసుకొచ్చిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. జాతీయ జట్టులోకి వెళ్లిన తర్వాత దేశవాళీ క్రికెట్‌పై చిన్నచూపు చూడటం సరైందికాదని కపిల్ దేవ్ అన్నాడు.

ఇలా అక్కడికి వెళ్లిన అందరూ రంజీ ట్రోఫీల్లాంటి వాటిని పక్కన పెడితే, వాటి మనుగడే ప్రమాదంలో పడుతుందని అన్నాడు. ఇది భారత భవిష్యత్ క్రికెట్‌కు మంచిది కాదని అన్నాడు. ఎందుకంటే భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఎంతో ప్రతిభావంతమైన ఆటగాళ్లున్నారు. వారందరూ వెలుగులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఒక్కటే ఆధారమని అన్నాడు. వీరందరూ అక్కడ నుంచి వచ్చిన వారే కదా అని తెలిపాడు.


అలాంటి మూలాలను నాశనం చేసే నిర్ణయాలను తీసుకునే క్రికెటర్లపై వేటు వేయడం సమంజసమేనని తెలిపాడు. ఎందుకంటే వీరిని క్షమించి వదిలేస్తే, తర్వాత మరికొందరు బయలుదేరుతారని, అప్పుడు గ్రౌండ్ సిస్టమ్ దెబ్బతింటుందని అన్నాడు. అప్పుడు అట్టగున ఉన్న క్రికెటర్లు వెలుగులోకి రారు. ఏదో డబ్బులున్నవాళ్లకే అవకాశాలు వస్తుంటాయి, ఇదొక ప్రమాదకర సంకేతమని అన్నాడు.

Read More: ధర్మశాలలో 100వ టెస్ట్ ఆడనున్న అశ్విన్..

ఇంట్లో నిబంధనలు పాటించు, పాటించకపో, అది మీ ఇష్టం. కానీ బయటకి వచ్చాక, నా ఇష్టం, నా ఇంట్లో ఉన్నట్టు ఉంటాను, నాకు నచ్చిందే చేస్తానంటే కుదరదని అన్నాడు. జాతీయ జట్టులో ఆడాలంటే, బీసీసీఐ చెప్పినట్టు చేయాల్సిందేనని అన్నాడు.

అదిష్టం ఉన్నా, లేకపోయినా ఆ వ్యవస్థను గౌరవించాలని అన్నాడు. అది అందరి బాధ్యత, ధర్మమని హితబోధ చేశాడు. లేకపోతే బీసీసీఐకి కూడా విలువ ఉండదని అన్నాడు. ఎవరి విలువను, వారి గౌరవాన్ని కాపాడుకోవాలంటే అప్పుడప్పుడు కొరడా తీయక తప్పదని తెలిపాడు. అందుకే బీసీసీఐ నిర్ణయాన్ని అభినందిస్తున్నాని తెలిపాడు.

వీళ్లిద్దరినీ తొలగించడం సహేతుకమా? కాదా? అనేది పక్కన పెడితే, శ్రేయాస్, ఇషాన్ కిషన్ కూడా ఇలా చేసి ఉండకూడదు. అది టీమ్ మేనేజ్మెంట్‌కి చెప్పి, బయటకు రావల్సిందని అన్నాడు. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ వీరి నిర్ణయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయ పడ్డాడు.

నిన్నటివరకు బీసీసీఐపై ఫైర్ అయిన నెటిజన్లు కపిల్ దేవ్ కామెంట్లు చూసి, ఇది కరెక్ట్ అని అంటున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×