Wanaparthy: వివాహేతర బంధం.. ఒక హత్యకు కారణమైంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. ఈ దారుణమైన ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య నాగమణి, ఆమె ప్రియుడు నందిమల శ్రీకాంత్ కలిసి భర్త కురుమూర్తిని హత్య చేశారు. అక్టోబర్ 28 న నాగమణి , శ్రీకాంత్ కలిసి.. కుట్ర పన్ని కురుమూర్తిని చంపారు. అనంతరం కారులో మృతదేహాన్ని తీసుకొని వెళ్లి శ్రీశైలం డ్యాం దగ్గర పడేశారు. కురుమూర్తి సోదరి చెన్నమ్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు .. నాగమణి , శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది.