Jemimah Rodrigues: స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 మెగా టోర్నీలో భారత జట్టు ఫైనల్ కి చేరిన విషయం తెలిసిందే. సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది భారత్. సెమీఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని టీం ఇండియా చేదించింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కి మంచి ఆరంభం లభించలేదు.
షెఫాలి పది పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరిన దశలో.. భారత జట్టును ఆదుకునే బాధ్యత స్మృతి మందానాతో కలిసి జెమీమా రోడ్రిక్స్ రెండవ వికెట్ కి 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇక 24 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన స్మృతి మందాన అవుట్ కావడంతో టీమిండియా 59 పరుగుల వద్ద రెండవ వికెట్ ని కోల్పోయింది. ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి జెమీమా ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించింది. 127 పరుగులు చేసి భారత్ ని గెలుపు బాట పట్టించింది. ఇలా తన అద్భుత ఆట తీరుతో దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది.
తన అద్భుత ఆట తీరుతో ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకున్న జెమీమా.. మ్యాచ్ అనంతరం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మ్యాచ్ గెలిచిన అనంతరం జమీమా తీవ్ర భావోద్వేగానికి గురైంది. కన్నీరు పెట్టుకుని మాట్లాడుతూ.. “ముందు నేను జీసస్ కి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఆయనే నన్ను ముందుకు నడిపించాడు. నేను సొంతంగా పోరాడలేకపోయాను. ఆ దేవుడు నన్ను భరించాడు. గత నాలుగు నెలలు నాకు చాలా కఠినంగా గడిచింది. ఇప్పుడు నాకు ఇదంతా ఓ కలలా అనిపిస్తుంది. నేను సెంచరీ గురించి ఆలోచించలేదు. జట్టును గెలిపించాలనే ఆలోచనే నా మైండ్ లో ఉంది. నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చింది. అయితే తనని జీసస్ ముందుండి నడిపించాడని జమీమా చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జెమీమాకు సోషల్ మీడియా వేదికగా నిరసన సెగ తగులుతోంది. ఆమెని ఏకంగా టీమిండియా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలు.
2024 అక్టోబర్ లో జెమీమా తండ్రి పై మతమార్పిడి ఆరోపణలు వచ్చాయి. జెమీమా తండ్రి ఇవాన్ రోడ్రిక్స్ క్లబ్ సౌకర్యాలను మతం మార్పిడికి సంబంధించిన కార్యక్రమాల కోసం ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి. ఇవాన్ సోదరుడు మాన్యువల్ మినిస్ట్రీస్ అనే సంస్థతో సంబంధం కలిగి ఉన్నాడని.. ప్రెసిడెన్షియల్ హాల్ లో అనేక మతపరమైన కార్యక్రమాలు నిర్వహించి మతమార్పిడి చేశారని ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Jemimah: ధోని బ్యాట్ కంటే, నా బ్యాట్ బరువే ఎక్కువ.. జెమిమా కామెంట్స్ వైరల్
అయితే గతంలోనే ఈ ఆరోపణలను జమీమా తండ్రి ఖండించారు. తనకు మతమార్పిడితో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కానీ తన తండ్రిపై వచ్చిన ఆరోపణల వల్ల జమీమా ఎంతగానో నష్టపోయింది. ఇప్పుడు మరోసారి ఆమెపై తీవ్ర విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి.
Jemimah said Jesus helped her win cos she couldn’t do it on her own but interestingly Jesus didn’t help Australia.
Bdw her family’s deep in forceful conversion rackets. Just connecting the dots. pic.twitter.com/Yvhi3yRHnI
— Karan Vijay Sharma (@ikaransharma27) October 31, 2025