BigTV English

Kavya Maran Addresses SRH Players: డ్రెస్సింగ్ రూమ్‌లో కావ్యమారన్.. కేవలం నాలుగు మాటలు.. ఇన్స్పిరేషన్ స్పీచ్@

Kavya Maran Addresses SRH Players: డ్రెస్సింగ్ రూమ్‌లో కావ్యమారన్.. కేవలం నాలుగు మాటలు.. ఇన్స్పిరేషన్ స్పీచ్@

Kavya Maran addresses SRH Players: ఐపీఎల్ – 2024 ఫైనల్ మ్యాచ్ ఓడిన తర్వాత కావ్య‌మారన్ ఎక్కడ? మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కంట తడి పెట్టి వెళ్లిపోయారు? అక్కడి నుంచి ఆమె నేరుగా ఎక్కడికి వెళ్లారు? ఆ తర్వాత ఎందుకు కనిపించడం మానేశారు? ఇలా రకరకాల ప్రశ్నలు సన్ రైజర్స్ అభిమానులను వెంటాడింది.


ఓటమి నుంచి తేరుకున్న కావ్యమారన్, నేరుగా సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఉన్న డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు . జట్టు ఓడిపోయిందని తాను నిరాశ పడే బదులు, ఆటగాళ్లలో ఉత్సాహం నింపారామె. ఐపీఎల్‌లో ఈసారి మీరు ఆడిన తీరు చాలా బాగుందని కితాబు ఇచ్చారు. ఈసారి మన జట్టు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేశారని ఆటగాళ్లను ఉద్దేశించి నాలుగు మాటలు మాట్లాడారు.

ఆదివారం మనది కాదని, కానీ టోర్నీలో చాలా చక్కగా ఆడారని మనసులోని మాట బయటపెట్టారు కావ్య మారన్. మైదానంలో అన్ని విభాగాల్లో చక్కగా రాణించారని, మీరు చేసిన ప్రదర్శన అమోఘమంటూనే అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. గత సీజన్‌లో ఆఖరి ప్లేస్‌లో ఉన్న సన్‌రైజర్స్ జట్టు, ఈసారి అందరూ మాట్లాడుకునేలా చేశారన్నారు. అంతేకాదు పెద్ద సంఖ్యలో అభిమానులు మైదానానికి వచ్చారంటే అందుకు కారణం మీరేనని వెల్లడించారు.


Also Read: ఐపీఎల్ చరిత్రలో..14 ఏళ్ల రికార్డ్ బద్దలైంది

కేకేఆర్ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచినా ప్రతి ఒక్కరూ మన జట్టు గురించి మాట్లాడుతున్నారని తెలిపారు కావ్య. ఈ టోర్నీ మనం ఆడిన ఆట మరిచిపోలేమని, ఈ విషయంలో ఎవరూ నిరుత్సాహపడవద్దన్నారు. ఫైనల్ వరకు చేరడం ఆషామాషీ కాదన్నారు. చాలా టీమ్‌లు మన ఆటను చూస్తూ ఉండిపోయారంటే అందుకు కారణం మీరేనంటూ ఆటగాళ్లను కాస్త ఉత్సాహ పరిచారు. త్వరలోనే మళ్లీ కలుద్దామని ముగించారు.

Tags

Related News

Asia Cup 2025 : నేడు టీమిండియా మొదటి మ్యాచ్… సూర్య కు షాక్ ఇస్తున్న చిలుక జోష్యం..!

AFG vs HK Asia Cup 2025: ఆసియా క‌ప్ లో ఆఫ్ఘనిస్తాన్ బోణీ..చిత్తు చిత్తైన హంగాంగ్‌

SA20 Auction: తెంబా బ‌వుమా, అండ‌ర్స‌న్ కు ఘోర అవ‌మానం.. ఇద్ద‌రూ అన్ సోల్డ్‌

SA 20 2026 auction : బ్రెవిస్ కు ఏకంగా రూ.8కోట్లు.. మార్క్ర‌మ్ కు కావ్య పాప ద్రోహం.. ఆక్ష‌న్ లిస్ట్ ఇదే..!

Suryakumar Yadav : పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపిన సూర్య కుమార్… నమ్మకద్రోహం అంటూ ట్రోలింగ్!

Lalit Modi : ఇండియాను నిండా ముంచిన లలిత్ మోడీ అదిరిపోయే ప్లాన్.. ఫుట్ బాల్ వద్దు.. కబడ్డీ ముద్దు అంటూ

×