E-Paper
Advertisement

Rafael Nadal Out French Open First Round: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. క్లే కోర్టు కింగ్ నాదల్ తొలి రౌండ్‌లో ఔట్!

Rafael Nadal Out French Open First Round: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. క్లే కోర్టు కింగ్ నాదల్ తొలి రౌండ్‌లో ఔట్!
Advertisement

Rafael Nadal out from French Open First Round: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్, క్లే కోర్టు కింగ్ రఫెల్ నాదల్ తొలిరౌండ్‌లో ఓటమి పాలయ్యాడు. జర్మనీకి చెందిన నాలుగో సీడ్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో 3-6, 6-7(5-7), 3-6 తేడాలో ఓటమి చవిచూడాడు. దాదాపు మూడు గంటలపాటు ఇరువురు ఆటగాళ్ల మధ్య పోరు సాగింది.

తొలి సెట్‌ను 59 నిమిషాల్లో సొంతం చేసుకున్నాడు అలెగ్జాండర్. రెండో సెట్‌లో ఇటు నాదల్- అటు జ్వెరెవ్ మధ్య నువ్వానేనా అన్నరీతిలో సాగింది. ఈ చివరకు ఆ సెట్ టై బ్రేక్ దారి తీసింది. అందులోనూ అనవసర తప్పిదాలు చేసి ఓటమి పాలయ్యాడు. చివరి సెట్‌లో ప్రత్యర్థి ముందు పెద్దగా ప్రతిఘటించ లేకపోయాడు రఫెల్‌నాదల్. ఆరు సార్లు సర్వీసు కోల్పోవడమేకాదు, 30 అనవసర తప్పిదాలు చేశాడు. ఫ్రెండ్ ఓపెన్‌లో సోదర్లింగ్, జకోవిచ్ తర్వాత జ్వెరెవ్ మాత్రమే నాదల్‌ను ఓడించారు.

Advertisement

2006లో ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిళ్ల యాత్ర మొదలుపెట్టాడు రఫెల్ నాదల్, ఆ తర్వాత ఆయనకు ఎదురు లేకుండా పోయింది. రోజర్ ఫెదరర్ వంటి ఆటగాడు సైతం నాదల్ ముందు నిలబడ లేకపోయారు. 2006 నుంచి 2022 వరకు వరుసగా 14 టైటిళ్లను గెలుచుకున్నాడు. మధ్యలో 2009, 2015, 2016, 2021 మాత్రమే ఓడిపోయాడు, గాయాల కారణంగా మధ్యలో వైదొలిగాడు. ఇక ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ శకం ముగిసిందనే చెప్పవచ్చు.

Also Read: డ్రెస్సింగ్ రూమ్‌లో కావ్యమారన్, కేవలం నాలుగు మాటలు..

Advertisement

గాయాలు, ఫిట్‌నెస్ వంటి సమస్యలు నాదల్‌ను దారుణంగా వెంటాడుతున్నాయి. తుంటి ఉదర కండరాల గాయాలతో ఇబ్బందిపడుతూ వచ్చాడు. 2023 నుంచి కేవలం 15 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఎక్కువగా మ్యాచ్‌లకు దూరంగా కావడంతో ర్యాంకు కూడా పడిపోయింది. తొలిసారి అన్‌సీడెడ్ ఆటగాడిగా బరిలోకి దిగాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడిన నాదల్, మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతానని మాత్రం చెప్పలేకపోయాడు.

మాట్లాడటానికి కష్టంగా ఉందన్నాడు రఫెల్ నాదల్. రెండేళ్లలో గాయాలతో చాలా ఇబ్బందిపడ్డానని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడం కష్టమని మనసులోని మాట బయటపెట్టాడు. జులైలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్ కోసం మాత్రం ఇక్కడికి మళ్లీ వస్తానని భావిస్తున్నట్లు చెప్పాడు నాదల్.

Also Read: Aus ex cricketer Joe Burns focus T20 WC: ఆసీస్ మాజీ ఆటగాడు జోబర్న్స్, నా టాలెంట్ చూపిస్తా..

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×