BigTV English

KKR Vs SRH Match Preview: కాసేపట్లో ప్రారంభం కానున్న మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్.. కోల్ కతా వర్సెస్ హైదరాబాద్!

KKR Vs SRH Match Preview: కాసేపట్లో ప్రారంభం కానున్న మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్.. కోల్ కతా వర్సెస్ హైదరాబాద్!

IPL 2024 First Qualifier Match – SRH Vs KKR Match Preview: ఐపీఎల్ చివరి అంకంలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ లో మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ మంగళవారం అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరగనుంది. నెంబర్ వన్ స్థానంలో ఉన్న కోల్ కతా, రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమవుతోంది.


ఇక్కడ గెలిచిన టీమ్ డైరక్టుగా ఫైనల్స్ కి చేరుతుంది. ఓడిన టీమ్ కి మరొక అవకాశం ఉంటుంది. అది ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన టీమ్ తో ఆడుతుంది. అప్పుడు ఈ రెండు జట్లకి మధ్య క్వాలిఫైయర్ -2 జరుగుతుంది. అందులో గెలిచిన జట్టు… క్వాలిఫైయర్-1 లో గెలిచిన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇదీ సీక్వెన్స్…

ఇకపోతే కోల్ కతా ఇంతవరకు ఐపీఎల్ లీగ్ దశలో 14 మ్యా చ్ లు ఆడింది. అందులో 9 గెలిచింది. 3 ఓడింది. 2 మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అందువల్ల ఆ జట్టు 20 పాయింట్లతో నెంబర్ వన్ ప్లేస్ లోకి వెళ్లింది.


Also Read: అభిషేక్ దూకుడు, బద్దలైన కోహ్లి రికార్డు.. రానున్న రోజుల్లో

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే 14 మ్యాచ్ లు ఆడింది. 8 గెలిచింది. 5 ఓడింది. 1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. అందువల్ల 17 పాయింట్లతో టాప్ 2 లోకి వెళ్లింది.

ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య 29 మ్యాచ్ లు జరిగాయి. కోల్ కతా 17 మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే, సన్ రైజర్స్ 9 మ్యాచ్ ల్లో గెలిచింది. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే ఈ రెండు జట్లు కూడా మొదటిసారి నరేంద్రమోదీ స్టేడియంలో ఆడనున్నాయి.

కోల్ కతా విషయానికి వస్తే శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ముందడుగు వేస్తోంది. తను అంత ప్రభావం చూపించలేకపోయినా సహచరులు అద్భుతంగా ఆడటంతో గెలుపు సులువుగా మారిపోయింది. చాలా ప్లాన్డ్ గా ఆడుతున్నారు. టీమ్ కూడా అంతా బాగా కుదిరింది. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ అందరూ అద్భుతంగా ఆడుతున్నారు. బౌలింగులో మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, రసెల్ అందరూ అత్యద్భుతంగా ఆడటంతో ప్రత్యర్థులకు పరుగులు తీయడం కష్టంగా మారింది.

Also Read: Playoff Schedule Matches : ప్లే ఆఫ్ షెడ్యూల్ మ్యాచ్ లు ఇవే..

హైదరాబాద్ విషయానికి వస్తే మొదట్లో తడబడినా తర్వాత మాత్రం ఒక రేంజ్ లో ఆడుకుంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. అదే ఊపులో ప్లే ఆఫ్ వరకు వచ్చిందంటే ఆశ్చర్యం అనిపించక మానదు.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్కరమ్, క్లాసిన్, నితీష్ కుమార్ రెడ్డి అందరూ దుమ్ము దులుపుతున్నారు. బౌలింగులో భువనేశ్వర్, కమిన్స్, నటరాజన్ కాసేయడంతో ప్రత్యర్థులకు పరుగులు తీయడం కష్టంగా ఉంది.

మరిప్పుడు ఇద్దరూ జమాజెట్టీల మధ్య పోరు ఎలా ఉండబోతుందోనని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

Related News

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హసరంగ

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

Big Stories

×