BigTV English
Advertisement

KL Rahul – Kantara: కాంతార క్లైమాక్స్‌ను దించేసిన కేఎల్ రాహుల్

KL Rahul – Kantara: కాంతార క్లైమాక్స్‌ను దించేసిన కేఎల్ రాహుల్

KL Rahul – Kantara: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL 2025) 2025లో భాగంగా గురువారం రోజు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సిబి పై ఢిల్లీ క్యాపిటల్స్ అరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందు బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ కి దిగిన ఆర్సిబి మొదటి నాలుగు ఓవర్లలోనే 60 పరుగులు బాధడంతో.. ఇక 200 ప్లస్ రన్స్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఫిల్ సాల్ట్ తర్వాత ఆర్సిబి బ్యాటర్లంతా పెవిలియన్ కి క్యూ కట్టారు. ఒకానొక దశలో 150 పరుగులు కూడా చేయలేదని అనుకున్నారు. కానీ ఆఖరిలో టిమ్ డేవిడ్ విధ్వంసంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 163 పరుగులు చేసింది. కాగా చిన్న స్వామి స్టేడియంలో 164 పరుగుల టార్గెట్ అంటే ఈజీగా చేజ్ చేయవచ్చని బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. డూప్లెసిస్, జాక్ ప్రెజర్, అభిషేక్ పోరెల్ వెంట వెంటనే అవుట్ అయ్యారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 30 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. ఇక 58 పరుగుల వద్ద కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా అవుట్ అయ్యాడు.


కేఎల్ రాహుల్ వీరోచిత ఇన్నింగ్స్:

జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్ లోకి వచ్చిన కేఎల్ రాహుల్ ( Kl Rahul ).. ట్రిస్టన్ స్టబ్స్ తో కలిసి నిదానంగా ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకువెళ్లాడు. 14 ఓవర్ల వరకు నెమ్మదిగా సాగిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ లో ఒక్కసారిగా మలుపు తిరిగింది. జోష్ హెజిల్ వుడ్ వేసిన 15 ఓవర్లో కేఎల్ రాహుల్ బౌండరీల మోత మోగించాడు. ఈ ఓవర్ లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత సుయాష్ శర్మ వేసిన 16వ ఓవర్ లో స్టబ్స్ ఒక ఫోర్, ఒక సిక్సర్ బాధడంతో 13 పరుగులు, భువనేశ్వర్ వేసిన 17 ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. దీంతో ఆ మూడు ఓవర్లలోనే ఏకంగా 47 పరుగులు వచ్చాయి. ఇక మ్యాచ్ విజయానికి 18 బంతుల్లో 18 పరుగులు కావలసిన సమయంలో యష్ దయాల్ కి కెప్టెన్ రజత్ బంతిని అందించాడు. దీంతో మొదటి రెండు బంతులు అద్భుతంగా వేసిన దయాల్.. ఆ తర్వాత సిక్సర్లు సమర్పించుకున్నాడు. ఇదే ఓవర్ లో ఐదవ బంతికి సిక్స్ బాధి కేఎల్ రాహుల్ మ్యాచ్ ని గెలిపించాడు. ఈ మ్యాచ్ లో 93 పరుగులతో అజయంగా నిలిచి జట్టును గెలిపించాడు కేఎల్ రాహుల్.


కేఎల్ రాహుల్ కాంతారా ( Kantara ) సెలబ్రేషన్స్:

తనకు ఇష్టమైన చిన్నస్వామి మైదానంలో కేఎల్ రాహుల్ చెలరేగి ఆడాడు. ఆ తరువాత ఇది నా అడ్డా అని అర్థం వచ్చే విధంగా తనకు ఇష్టమైన కాంతారా సినిమాలోని సంజ్ఞతో గెలుపు సంబరాలు చేసుకున్నాడు. తద్వారా ఈ స్టేడియం తన సొంత మైదానం అని రాహుల్ గర్వంగా ప్రకటించాడు. తన బ్యాట్ తో వృత్తం గీసి, అందులో బ్యాట్ పాతి.. చేసుకున్న సెలబ్రేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇలా చేసిన అనంతరం డూప్లేసిస్, టిమ్ డేవిడ్ కూడా ఈ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకోవడం కెమెరాలలో కనిపించింది. ఇక ఈ సెలబ్రేషన్స్ అనంతరం మాట్లాడిన కేఎల్ రాహుల్.. ” నా సెలబ్రేషన్స్.. నా ఫేవరెట్ మూవీ “కాంతారా” మూవీ లోనిది. ఈ చిన్నస్వామి స్టేడియం నా ఇల్లు. నా గ్రౌండ్. ఈ మట్టి మీదే నేను పెరిగాను. దీని గురించి అందరికంటే నాకే బాగా తెలుసు. ఇక్కడ ఆడడాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను” అని చెప్పుకొచ్చాడు.

Also Read:  AirAsia – SRH: SRH కోసం ఖరీదైన విమానం.. ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by 🕊”MR” Perfect..🕊 (@king_bob_world)

Related News

RCB ON SALE: అమ్ముడుపోయిన RCB, WPL జ‌ట్లు.. మార్చి నుంచే కొత్త ఓన‌ర్ చేతిలో !

Indian Womens Team: ప్ర‌ధాని మోడీకి వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌ల స్పెష‌ల్ గిఫ్ట్‌..”న‌మో” అంటూ

IND VS SA: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌..ష‌మీకి నిరాశే, పంత్ రీ ఎంట్రీ, టీమిండియా జ‌ట్టు ఇదే

Bowling Action: ముత్త‌య్య, భ‌జ్జీ, వార్న్‌, కుంబ్లే అంద‌రినీ క‌లిపేసి బౌలింగ్‌.. ఇంత‌కీ ఎవ‌డ్రా వీడు!

WI vs NZ 1st T20i: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్

pak vs sa match: గ‌ల్లీ క్రికెట్ లాగా మారిన పాకిస్తాన్ మ్యాచ్‌… బంతి కోసం 30 నిమిషాలు వెతికార్రా !

Jemimah Rodrigues Trolls: ఆ దేవుడి బిడ్డే లేకుంటే, టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచేదే కాదు.. హిందువుల‌కు కౌంట‌ర్లు ?

Jemimah Rodrigues: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. జెమిమా బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెంపు.. ఎన్ని కోట్లు అంటే

Big Stories

×