BigTV English

AirAsia – SRH: SRH కోసం ఖరీదైన విమానం.. ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..

AirAsia – SRH: SRH కోసం ఖరీదైన విమానం.. ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..

AirAsia – SRH: ఐపీఎల్ 2024 లో సన్రైజర్స్ హైదరాబాద్ ఎంతలా చెలరేగి ఆడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ప్రదర్శనని దృష్టిలో పెట్టుకొని ఈ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ పై అభిమానులలో భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సీజన్ లో ఆరెంజ్ ఆర్మీ ఖచ్చితంగా కప్ కొడుతుందని అంతా భావించారు. ఇందుకు తగ్గట్లుగానే ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో దూకుడు ప్రదర్శించింది సన్రైజర్స్ హైదరాబాద్.


సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములు

మొదటి మ్యాచ్ లో గెలుపు అనంతపురం ఆ తర్వాత ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు మ్యాచ్ లలో పరాజయం, భారీ అంచనాలు పెట్టుకున్న టాప్ 3 బ్యాటర్లు వరుసగా విఫలం, టోర్నీలో అన్ని జట్ల కంటే చెత్త ఎకానమీ {10.73} నమోదు చేసిన బౌలర్లు.. ఇలా అన్ని సమస్యలే. 300 లోడింగ్ అంటూ భారీ స్కోర్ల మాట అటు ఉంచితే.. కనీసం మ్యాచ్ గెలిచే ప్రదర్శన కూడా చేయలేని స్థితికి చేరింది. బ్యాటర్లు పిచ్ తో సంబంధం లేకుండా మొదటి బంతి నుండే దూకుడైన ఆట తీరును నమ్ముకుని బోల్తా కొడుతున్నారు. మరోవైపు బౌలర్లు రాణించడం లేదు. ఇక వికెట్ టేకింగ్ స్పిన్నర్లు ప్లేయింగ్ ఎలెవేన్ లో లేరు. ఇలా నాలుగు మ్యాచ్లలో వరసగా ఓటమిపాలై.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది సన్రైజర్స్ హైదరాబాద్. ఇలాంటి స్థితిలో నేడు సొంత మైదానంలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. నేడు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే సమరంలో పంజాబ్ కింగ్స్ తో సన్రైజర్స్ తలపడుతుంది. వరుసగా మూడు విజయాలతో ఫామ్ లో ఉన్న పంజాబ్ ను… సన్రైజర్స్ ఏ మాత్రం నిలువరిస్తుందనేది చూడాలి. ఈ మ్యాచ్ హైదరాబాద్ జట్టుకు ఎంతో కీలకంగా మారింది. ఇప్పటివరకు హైదరాబాద్ – పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లలో.. సన్రైజర్స్ జట్టు పై చేయి సాధించినట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య మొత్తం 23 మ్యాచ్ లు జరిగితే.. ఇందులో సన్రైజర్స్ హైదరాబాద్ 16 మ్యాచ్లలో విజయం సాధించగా.. పంజాబ్ కింగ్స్ జట్టు 7 మ్యాచ్లలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకే విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


Also Read: IPL 2025: ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్ లు..ప్లే ఆఫ్ కు SRH వెళ్లాలంటే ఇలా జరగాల్సిందే !

సన్రైజర్స్ హైదరాబాద్ విమానం

బడ్జెట్ ఎయిర్ లైన్స్ అయిన ఎయిర్ ఏషియా భాగస్వామిగా సన్రైజర్స్ హైదరాబాద్ వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి ప్రవేశించింది. హైదరాబాద్ ఆటగాళ్లు వివిధ స్టేడియాలకు వెళ్ళడానికి విమానాలలో ప్రయాణం చేస్తుంటారు. హైదరాబాద్ ఆటగాళ్లు మాత్రమే కాదు.. ఇతర జట్ల ఆటగాళ్లు కూడా విమానాలలోనే ఇతర స్టేడియాలకు వెళుతుంటారు. అయితే వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడంతో హైదరాబాద్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు వివిధ స్టేడియాలకు ప్రయాణించేందుకు సరికొత్త విమానాన్ని రూపొందించింది. ఈ విమానాన్ని ఎయిర్ ఆసియా నడుపుతుంది. ఇందులో భాగంగానే విమానానికి సన్రైజర్స్ లోగో ఉండే విధంగా రూపొందించింది. ఇందుకు సంబంధించిన వీడియోని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేయడంతో.. హైదరాబాద్ అభిమానులు తెగ రీ ట్వీట్ చేస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ ముగింసేంతవరకు ఎయిర్ ఆసియాతో హైదరాబాద్ జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రకారం హైదరాబాద్ ఆడే మ్యాచ్ ల వేదిక వద్దకు ఎయిర్ ఆసియా విమానం ఆటగాళ్లను తీసుకెళ్తోంది.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by cricket 2025 (@cricket_lover__0731)

Related News

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Night watchman : టెస్ట్ క్రికెట్ లో అసలు నైట్ వాచ్మెన్ అంటే ఎవరు.. వాళ్ల డ్యూటీ ఏంటి

Shreyas Iyer: శ్రేయస్‌కు మరోసారి నిరాశే.. ఆసియా కప్‌ జట్టులో నో ఛాన్స్ ?

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Big Stories

×