BigTV English

AP Inter Results 2025: ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి.

AP Inter Results 2025: ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి.

AP Inter Results 2025: ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. అలాగే మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కి “Hi” మెసేజ్ పంపితే కూడా ఫలితాలను పొందవచ్చని చెప్పారు. ఇక ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 70% ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 83% ఉత్తీర్ణత శాతం నమోదైంది.


ముఖ్యంగా ప్రభుత్వ నిర్వహణ విద్యా సంస్థల్లో ఉత్తీర్ణత పెరిగిందని వెల్లడించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాళల (GJCs) లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం.. పది సంవత్సరాల గరిష్ట స్థాయి 69% కి చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47%గా ఉంది. ఈ విజయం విద్యార్ధులు జూనియర్ లెక్చరర్ల కృషికి నిదర్శనం అని తెలిపారు. ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందకుండా, దీనిని ఒక అడుగుగా భావించి, మరింత కృష్టపడి చదవాలని సూచించారు. విద్యార్ధులు ఎప్పుడు పోరాటాన్ని ఆపకూడదని, విజయం కోసం ప్రయత్నించడంలో తప్పులేదని మంత్రి నారా లోకేష్ అన్నారు.

కాగా ఈ ఏడాది ఏపీ ఇంటర్ పరీక్షలు మార్చి 20వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బోర్డు స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఫలితాలను వేగంగా ప్రకటించడానికి చర్యలు చేపట్టింది. మొత్తం 25 కేంద్రాల్లో మార్చి 17వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభం కాగా.. మొత్తం నాలుగు విడతల్లో పూర్తి చేశారు. కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ఈరోజు ఫలితాలను విడుదల చేశారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం కలిపి 10 లక్షల మందికి పైగా విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు.


Also Read: పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ డెత్.. ఇవిగో ప్రూఫ్స్.. తేల్చి చెప్పిన ఐజీ

ఎలా చెక్ చేసుకోవాలంటే

ఏపీ ఇంటర్ అభ్యర్ధులు హాల్ టికెట్ తెలుగు వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో కనిపించే ఏపీ బోర్డు రిజల్ట్స్ 2025 లైవ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నెంబర్‌ను అందులో ఎంటర్ చేసి చివరిగా సబ్ మిట్ చేయాలి. మీ ఫలితాలు డిస్‌ప్లై అవుతాయి. కింద ఇచ్చిన డైరక్ట్ లింక్స్ ద్వారా ఫలితాలను సింపుల్‌గా తెలుసుకోవచ్చు.

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడంటే..
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5న ప్రారంభమై 25వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మూల్యాంకన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఏప్రిల్ చివరి వారంలో ఇంటర్ రిజల్ట్ రిలీజ్ చేయనున్నట్లు.. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TSBIE) అధికారిక వర్గాల సమాచారం. ఫలితాల కోసం tgbie.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు.

Related News

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

AP Cabinet: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. ఒకటి కాదు సుమా.. అవేమిటంటే?

Big Stories

×