BigTV English

Wimbledon 2024 prize money: వింబుల్డన్ విజేతలకు ఎన్నికోట్ల ప్రైజ్ మని తెలుసా?.. ఐపిఎల్ కంటే ఎక్కువే..

Wimbledon 2024 prize money: వింబుల్డన్ విజేతలకు ఎన్నికోట్ల ప్రైజ్ మని తెలుసా?.. ఐపిఎల్ కంటే ఎక్కువే..

Wimbledon 2024 prize money: వింబుల్డన్ 2024 విజేతగా మరోసారి కార్లోస్ అల్కరాజ్ నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో నోవాక్ జకోవిచ్‌ని ఆయన రెండోసారి ఓడించి తన టైటిల్‌ని కాపాడుకున్నారు.


వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన వర్డల్డ్ నెంబర్ 3 కార్లోస్.. మరో రికార్డ్ కూడా బద్దలు కొట్టాడు. అదే విన్నర్‌కు లభించే ప్రైజ్ మనీ. ఇప్పటివరకు ఏ టెన్నిస్ ప్లేయర్ కూడా ఒక టోర్నమెంట్ గెలిచి ఇంత ప్రైజ్ మనీ పొందలేదు. వింబుల్డన్ 2024 విజేతగా ఆయనకు 2.7 మిలియన్ గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ నగదు బహుమతి లభించింది. ఇండియా కరెన్సీలో చెప్పాలంటే.. రూ.28.64 కోట్లు. మరోవైపు ఫైనల్‌లో రన్నరప్ గా నిలిచిన నొవాక్ జకోవిచ్‌కు 1.4 గ్రేట్ బ్రిటన్ పౌండ్స్.. అంటే రూ.14.8 కోట్లు.

Also Read: ‘టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ మా దేశంలో ఆడాల్సిందే’.. పాకిస్తాన్ బెదిరింపు


అంటే ఒక వింబుల్డన్ విన్నర్‌కు మొత్తం ఐపిఎల్ ఫైనల్ విజేత టీమ్ కంటే ఎక్కువ ప్రైజ్ మనీ లభిస్తుంది. విన్నర్ కార్లోస్ ఒక్కరికే రూ.28.64 కోట్లు దక్కితే.. ఐపిఎల్ 2024లో విజేతలుగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మొత్తానికి రూ.20 కోట్లు మాత్రమే లభించాయి.

వింబుల్డన్ నిర్వాహకులు 2023లో ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే ఈ సంవత్సరం 11.9% ఎక్కువ ఇచ్చారు. పైగా పురుషుల సింగిల్స్ లో గెలిచిన కార్లోస్ అల్కరాజ్‌కు, మహిళల సింగిల్స్ టైటిల్ విన్నర్ అయిన బార్‌బారో క్రెజికోవాకు సమానంగా ప్రైజ్ మనీ ఇచ్చారు. వీరిద్దరికీ చెరో 28.64 కోట్ల దక్కాయి.

పురుషులు, మహిళ సింగిల్స్ లో రన్నరప్స్ గా నిలిచిన నొవాక్ జకోవిచ్, జాస్మిన్ పావోలినీ ఇద్దరికీ చెరో రూ.14.85 కోట్లు లభించాయి. అలాగే సెమీఫైనల్స్‌లో ఓడపోయిన డానీల్ మెద్వెదేవ్, లొరెన్జో ముసెట్టీ, ఎలెనా రబాకీనా, డాన్నా వెకిక్.. వీరదరికీ తలా రూ.7.58 కోట్లు లభించాయి. క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన ఎనిమిది మందికి కూడా తలా రూ.3.97కోట్లు లభించాయి.

Also Read: టెస్టు క్రికెట్‌లో అరుదైన బౌలర్ జేమ్స్ ఆండర్సన్.. అతని పేరున్న రికార్డ్స్ ఇవే..

ఇంత ప్రైజ్ మనీ చూస్తుంటే.. కేవలం వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు అర్హత సాధిస్తే చాలు కోట్లు సంపాదించవచ్చు అనే కోరిక కలుగుతుంది.

ఇంతా ప్రైజ్ మనీ ఇవ్వడానికి కారణం కూడా ఉంది. ముఖ్యంగా టెన్నిస్‌లో వింబుల్డన్‌కు విపరీతమైన ఆదరణ లభించడం. ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్, జకోవిచ్ మధ్య ఎవరు గెలుస్తారో అనేది చూసేందుకు ప్రేక్షకులు ఉత్కంఠంగా చూశారు. ప్రత్యక్షంగా టెన్నిస్ కోర్టులో కూర్చొని చూడడానికి టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫైనల్ మ్యాచ్ సెంటర్ కోర్టులో చూడడానికి ఒక్కో టికెట్ గరిష్ఠంగా మూడు కోట్ల నుంచి 31 లక్షల 37వేలకు రూపాయలకు విక్రయించింది. కోర్టు వెనుక భాగంలో సీట్ల టికెట్లు 8 లక్షలకు విక్రయించారు.

Also Read: యువరాజ్ ఆల్ టైం ఫేవరేట్ టీం ఇదేనంటా.. ధోనీకి చోటులేదా?

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×